- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా కొడుకును చూసి గర్వపడుతున్నా: అభిజిత్ దీప్కే తల్లి
కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే తల్లి అనితా దీప్కే తన కుమారుడిని చూసి గర్వపడుతున్నానని అన్నారు. ఈ రోజు చాలా ఆనందంగా ఉందని, ఇది తమ జీవితంలో అద్భుతమైన రోజు అని వ్యాఖ్యానించారు.

దిశ, వెబ్ డెస్క్: కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే తల్లి అనితా దీప్కే తన కుమారుడిని చూసి గర్వపడుతున్నానని అన్నారు. ఈ రోజు చాలా ఆనందంగా ఉందని, ఇది తమ జీవితంలో అద్భుతమైన రోజు అని వ్యాఖ్యానించారు. తన క ఉమారుడు నిజాయితీతో చేసిన కృషికి చివరకు ఫలితం దక్కిందని చెప్పారు. అభిజిత్ పెట్టిన డిమాండ్ నెరవేర్చాల్సిందేనని అతడు గట్టిగా నిర్ణయించుకున్నాడని, అదే పట్టుదలతో చివరి వరకు పోరాడాడని చెప్పారు. మొదట్లో తాము చాలా భయపడ్డామని, జైపూర్ లో అతనని చెంపదెబ్బ కొట్టినప్పుడు తమకు బాధ కలిసిందని అన్నారు.
ఆ రాత్రంతా తాము నిద్రపోలేకపోయామని కన్నీళ్లు పెట్టుకున్నారు. అభిజిత్ ఇంటికి తిగిరి వచ్చిన తరవాత అందరం కలిసి స్వీట్లు పంచుకుని ఘనంగా సంబరాలు జరుపుకోవాలని అనుకుంటున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే నీన్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ ముందు నుండి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలను మించి కాక్రోచ్ పార్టీ చేసిన పోరాటానికి దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. దాదాపు 20 రోజులకు పైగా నిరసనలో పాల్గొని చివరికి అనుకున్నది సాధించింది.






