జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు : మంత్రి జి.కిషన్ రెడ్డి

by Naga Rani Yarlagadda |

జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే సీఎం రేవంత్ రెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు : మంత్రి జి.కిషన్ రెడ్డి
X
  • బీజేపీ అధికారంలోకొస్తే సింగరేణి కార్మికుల ఇన్ ట్యాక్స్ రద్దు చేస్తాం

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే సీఎం రేవంత్ రెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. 12 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, సంస్కరణల గురించి ప్రెస్ బ్రీఫింగ్ లో కిషన్ రెడ్డి వివరించారు. సింగరేణికి సంబంధించి.. రెండేళ్లలో.. ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేశానని తెలిపారు. సింగరేణికి కార్మికులకు న్యాయం చేసే ప్రయత్నం చేశానని అన్నారు. కోలిండియాతోపాటుగా సింగరేణి ఉద్యోగస్తులకు ఇన్సూరెన్స్ పెంచామని, గతంలో 30 లక్షలు, 40 లక్షలుండే ప్రమాదబీమాను.. కోటి రూపాయలకు పెంచామని, ఇవాళ్టి లెక్కల ప్రకారం.. కోటి 25 లక్షల వరకు వారికి ప్రమాదబీమా వస్తుందన్నారు. దీన్ని ఇప్పుడు ప్రధాని మోదీ అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో దీన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. మైన్ క్లోజింగ్ కు ముందు,మైన్ క్లోజింగ్ తర్వాత అనే విషయంలో.. వీడియోస్ సిద్ధం చేసి విడుదల చేస్తామని చెప్పారు.

వాటర్ బాడీస్ గా, సోలార్ పార్కులుగా.. చాలా మార్పులు చేస్తున్నామని, కోల్ గ్యాసిఫికేషన్ లో అనుకున్న లక్షాలను చేరుకుంటామని, 100 మిలియన్ టన్నుల బొగ్గును కేటాయిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణిలో యాత్ర చేశానని చెప్పారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. సింగరేణి ఉద్యోగుల ఇన్ కమ్ టాక్స్ మినహాయింపు చేస్తానని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలను అడిగితే.. వారు చేయలేదని, మేం 2028లో అధికారంలోకి రాగానే.. కచ్చితంగా వారికి ఆదాయపుపన్ను మినహాయింపు ఇస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీ నుంచి కోల్ మినిస్ట్రీ అధికారులను సింగరేణికి పెంచి.. ఖర్చు తగ్గించేందుకు ఏం చేయాలనే దానిపై సూచనలు చేశానని చెప్పారు. ప్రయివేట్ మైనింగ్, కమర్షియల్ మైనింగ్ కారణంగా.. ఉద్యోగాలు పెరుగుతున్నాయని చెప్పారు. కమర్షియల్ మైనింగ్ ద్వారా.. 800 మిలియన్ టన్స్ బొగ్గు ఉత్పత్తి జరగనుందని, దానికి అనుగుణంగా ఉద్యోగాల కల్పన పెరుగుతుందని తెలిపారు.

Next Story