- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డబ్బులిస్తే ఫొటోలు డిలీట్ చేస్తా.. యువతిని బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి
ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసగించిన వ్యక్తి పై ఫిలింనగర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.

దిశ, ఖైరతాబాద్ : ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసగించిన వ్యక్తి పై ఫిలింనగర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం బోడుప్పల్‌కు చెందిన రాము (40) ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఫిలింనగర్‌కు చెందిన 32 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన రాము, యువతితో సన్నిహితంగా మెలుగుతూ ఆమెను శారీరకంగా లోబర్చుకున్నాడు. అయితే ఇటీవల పెళ్లి విషయాన్ని ప్రస్తావించగా, డబ్బు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానంటూ షరతులు పెట్టినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా, తనతో కలిసి దిగిన వ్యక్తిగత ఫోటోలు ఉన్నాయని వాటిని తొలగించాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిపింది. దీంతో బాధితురాలు ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






