- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండు రోజుల్లోనే చోరీ కేసు ఛేదన.. రూ.26 లక్షల విలువైన నగల స్వాధీనం
పహాడీషరీఫ్ పోలీసులు గృహ చోరీ కేసును అత్యంత వేగంగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు రూ.26 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

దిశ, చంపాపేట్ : పహాడీషరీఫ్ పోలీసులు గృహ చోరీ కేసును అత్యంత వేగంగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు రూ.26 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదైన కేవలం రెండు రోజుల్లోనే నిందితుడిని పట్టుకోవడం పోలీసుల సమర్థతకు నిదర్శనంగా నిలిచింది. పోలీసుల కథనం ప్రకారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన అకుమళ్ల బాబాపీర్ అలియాస్ బాబా (20) ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్న అతడు రాత్రి వేళల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడేవాడు.
ఇళ్లలోని వెంటిలేటర్ అద్దాలను తొలగించి లోపలికి ప్రవేశించిన నిందితుడు, తన వద్ద ఉన్న స్క్రూడ్రైవర్‌తో బీరువా లాకర్లను పగులగొట్టి బంగారం, వెండి ఆభరణాలను అపహరించేవాడని పోలీసులు తెలిపారు. అనంతరం వాటిని నగరంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయించి వచ్చిన డబ్బును వ్యక్తిగత అవసరాలకు వినియోగించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ నెల 5న పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదు మేరకు, బాధితుడు నేనావత్ మల్లికార్జున తన కుటుంబంతో కలిసి స్వగ్రామానికి వెళ్లి తిరిగి ఇంటికి రాగా చోరీ జరిగినట్లు గుర్తించారు. ఇంట్లోని బీరువా లాకర్‌ను పగులగొట్టి సుమారు 17 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను దుండగుడు అపహరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ విశ్లేషణ, నిఘా సమాచారంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు జూన్ 7న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 166 గ్రాముల బంగారు ఆభరణాలు, 257 గ్రాముల వెండి వస్తువులు, చోరీకి ఉపయోగించిన స్క్రూడ్రైవర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆర్‌జీఐఏ డివిజన్ ఏసీపీ వి. శ్రీకాంత్ గౌడ్ పర్యవేక్షణలో పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ బి. లక్ష్మీనారాయణ రెడ్డి, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ డి. డెబోరా, ఎస్‌ఐ మహ్మద్ ఫైసల్ అహ్మద్‌తో పాటు పోలీసు సిబ్బంది సమన్వయంతో ఈ కేసు ఛేదించినట్లు అధికారులు తెలిపారు. కేసును వేగంగా పరిష్కరించి భారీ విలువైన ఆస్తిని రికవరీ చేసిన పోలీసు బృందాన్ని షంషాబాద్ జోన్ డీసీపీ అభినందించారు. పోలీసు సిబ్బందికి ప్రత్యేక బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు.






