కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: విశాఖ ఉక్కు ప్రమాదంపై షర్మిల ఆవేదన

by Vemula.Srinu Prasad |

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు...

కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: విశాఖ ఉక్కు ప్రమాదంపై షర్మిల ఆవేదన
X

దిశ, ఏపీ బ్యూరో: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో తొమ్మిది మంది కార్మికులు సజీవదహనం కావడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని షర్మిల ఆరోపించారు. పాత యంత్రాలను మార్చి ఆధునిక సదుపాయాలు కల్పించి ఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కావని అన్నారు. ప్రమాదంపై ఉన్నతస్థాయి కమిటీతో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story