ఎఫ్ఎల్ఎన్ బలోపేతానికి జిల్లా కార్యాచరణ ప్రణాళిక ఖరారు..

by Kodari Anjali |

ప్రాథమిక విద్యాభివృద్దికి ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరాసి (ఎఫ్ఎల్ఎన్) అత్యంత కీలకమని మేడ్చల్ జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి అన్నారు.

ఎఫ్ఎల్ఎన్ బలోపేతానికి జిల్లా కార్యాచరణ ప్రణాళిక ఖరారు..
X

దిశ, మేడ్చల్ బ్యూరో: ప్రాథమిక విద్యాభివృద్దికి ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరాసి (ఎఫ్ఎల్ఎన్) అత్యంత కీలకమని మేడ్చల్ జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి అన్నారు. సోమవారం జిల్లాలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఫలితాల మెరుగుదలకు (2026–27) విద్యా సంవత్సరానికి జిల్లా వార్షిక ప్రణాళికా వర్క్‌షాప్ సోమవారం మెడ్చల్ లోని ఐడిఓసీ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకా దేవి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డి. వేణు, జిల్లా రిసోర్స్ పర్సన్స్, సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. వర్క్‌షాప్‌లో వార్షిక ఎఫ్‌ఎల్‌ఎన్ మూల్యాంకన ఫలితాలు, ఉపాధ్యాయుల అంచనా వివరాలు, జిల్లాలోని అభ్యాస ధోరణులను సమీక్షించి, రాబోయే విద్యా సంవత్సరానికి సబ్జెక్ట్‌వారీ లక్ష్యాలను ఖరారు చేశారు. లక్ష్యాల సాధన కోసం స్కూల్ రెడినెస్ కార్యక్రమం, సబ్జెక్ట్‌వారీ రిమీడియేషన్ వ్యూహాలు, విద్యార్థుల అభ్యాస పురోగతి పర్యవేక్షణ, స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల బలోపేతం, సహాయక పర్యవేక్షణ వ్యవస్థలు, సమీక్షా విధానాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. అలాగే పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్ సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు, ఉపాధ్యాయులు, మెంటర్ల సామర్థ్యాభివృద్ధి, ప్రోత్సాహక వ్యవస్థలపై చర్చించారు. కార్యక్రమం చివరలో జిల్లా స్థాయి ప్రాధాన్యతలు, కాలపట్టికలు, బాధ్యతలు, జవాబుదారీతన వ్యవస్థలను ఖరారు చేస్తూ ఎఫ్‌ఎల్‌ఎన్ లక్ష్యాల సాధనకు సంయుక్త కార్యాచరణ ప్రణాళికను ఆమోదించారు.

Next Story