ఆంధ్రా పేపర్ మిల్స్‌కు షోకాజు నోటీసులు పంపండి: డిప్యూటీ CM పవన్ ఆదేశం

by Naga Rani Yarlagadda |

వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల సమయానికి నదిని కాలుష్యరహితంగా మార్చాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కంకణం కట్టుకున్నారు.

ఆంధ్రా పేపర్ మిల్స్‌కు షోకాజు నోటీసులు పంపండి: డిప్యూటీ CM పవన్ ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల సమయానికి నదిని కాలుష్యరహితంగా మార్చాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆయన ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని నదీ పరివాహక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి.. ఎక్కడెక్కడ నది కాలుష్యానికి గురవుతుందో పరిశీలించారు. నది కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలను నియంత్రించడంలో కాలుష్య నియంత్రణ మండలి విఫలమైందని ఫైరయ్యారు. సోమవారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో నిర్వహించిన సమావేశంలో గోదావరి నది నుంచి సేకరించిన నమూనాల రిపోర్టుల గురించి మాట్లాడారు. నదిలో నిర్దేశిత పరిమాణం కంటే భారీస్థాయిలో వ్యర్థాలు, రసాయనాలు కలుస్తున్నట్లు నివేదికలో వెల్లడైందని, దీనిపై అధికారులంతా ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలకోసారి నది నమూనాలను సేకరిస్తున్నామని బదులివ్వగా.. అలాంటపుడు నది కాలుష్యానికి కారణమవుతున్న కంపెనీలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. నదిని కాలుష్యం చేస్తున్న ఆంధ్రా పేపర్ మిల్స్ యాజమాన్యానికి వెంటనే షోకాజు నోటీసులు జారీ చేయాలని, అలాగే రాజమండ్రి కార్పొరేషన్ కు కూడా నోటీసులు పంపాలని ఆదేశించారు.

Next Story