రిలీజ్‌కు సిద్ధమైన ‘కొరియన్ కనకరాజు’!

by Mallepaka Hamsa |

తాజా సమాచారం ప్రకారం.. ‘కొరియన్ కనకరాజు’ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

రిలీజ్‌కు సిద్ధమైన ‘కొరియన్ కనకరాజు’!
X

దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్‌ హిట్ కోసం గత కొద్ది కాలంగా సమమతమవుతున్నాడు. వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ బాక్సాఫీసు వద్ద ఆశినంత స్థాయిలో విజయాన్ని దక్కించుకోలేకపోతున్నాయి. అయినప్పటికీ ఆయన ఏ మాత్రం నిరాశ చెందుకుండా వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’. ఇందులో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు యూవి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వినూత్నమైన కాన్పెప్ట్‌తో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే కొంతశాతం పూర్తి కాగా.. విడుదలైన టీజన్, ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్‌ను సొంతం చేసుకున్నాయి.

ఇక ఇప్పుడు షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని అంతా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ‘కొరియన్ కనకరాజు’ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.అంతేకాకుండా జూన్ మూడో వారంలో స్సెషల్ గ్లింప్స్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Next Story