- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Charlie Kirk: డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ దారుణ హత్య.. స్పందించిన అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహిత మిత్రుడు చార్లీ కిర్క్ దారుణ హత్యకు గురయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సన్నిహిత మిత్రుడు చార్లీ కిర్క్ (Charlie Kirk) దారుణ హత్యకు గురయ్యారు. అమెరికా కాలమాన ప్రకారం బుధవారం ఉటా వ్యాలీ యూనిర్సిటీ ఈవెంట్‌లో దుండగుల కాల్పుల్లో యూఎస్ పొలిటికల్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ (31) మృతిచెందారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్చి చంపారు. వందలాది మంది పాల్గొన్న ఈ ‘ది అమెరికన్ కమ్‌బ్యాక్ టూర్’ (The American Comeback Tour) మీటింగ్‌లో చార్లీ ప్రశ్నలు అడుగుతున్న సమయంలో మెడకు బుల్లెట్ దిగండంతో స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
చార్లీ కిర్క్ మరణ వార్తను తాజాగా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. 'అమెరికా యువత మనసుల్ని చార్లీ కంటే ఎవరూ బాగా అర్థం చేసుకోలేదు. అతన్ని నాతో పాటు అందరూ అభిమానించారు. ఇప్పుడు అతడు మనతో లేడు. చార్లీ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నా' అని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అలాగే ఈ హత్య వెనుక రాడికల్ లెఫ్ట్ హస్తం ఉందని ట్రంప్ ఆరోపించారు. ఇలాంటి చర్యలు వెంటనే ఆగాలని, ఈ హత్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ, దీన్ని సమర్థించే సంస్థలనూ శిక్షిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. కాగా, 31 ఏళ్ల చార్లీకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2024 ప్రెసిడెంట్ ఎన్నికల్లో ట్రంప్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. అలాగే సోషల్ మీడియాలో లక్షలాది మంది అనుచరులను కలిగి ఉన్నాడు.
Read More..






