- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్ రెక్కలు విరిచేశాం..ఇకపై నో సీజ్‌ఫైర్ : ట్రంప్
ఇరాన్ దేశాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నామని.. ఇలాంటి సమయంలో సీజ్ ఫైర్ (Ceasefire) అవసరం లేదని పేర్కొన్నారు ట్రంప్.

Donald Trump Rejects Idea of a Ceasefire With Iran
దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ దేశంతో జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ దేశాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నామని.. ఇలాంటి సమయంలో సీజ్ ఫైర్ (Ceasefire) అవసరం లేదని పేర్కొన్నారు ట్రంప్. ఇరాన్ తో యుద్ధంలో సీజ్ ఫైర్ పై తనకు ఏ మాత్రం ఆసక్తి లేదని క్లారిటీ ఇచ్చారు. చర్చలు ఇరాన్ తో జరపవచ్చు, కానీ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలని తాను అనుకోవడంలేదని కుండబద్దలు కొట్టి చెప్పారు. అవతలి పక్షాన్ని నాశనం చేస్తున్నప్పుడు మనకు సీజ్ ఫైర్ అవసరం లేదని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ కు సంబంధించిన నేవీ, వైమానిక దళాలను ఫినిష్ చేసినట్లు తెలిపారు. అసలు వారి దగ్గర ఎలాంటి పరికరాలు లేవని తాజాగా మీడియాతో వెల్లడించారు. అమెరికా అనుకుంటే ఇప్పుడే యుద్ధాన్ని ముగించగలదని స్పష్టం చేశారు. ఇరాన్ పై ఐదు ప్రధాన లక్ష్యాలపై అమెరికా విజయం సాధించిందని తెలిపారు. హార్ముజ్ జలసంధి ( Strait of Hormuz) మార్గాన్ని ఉపయోగించుకునే దేశాలే ఇకపై భద్రత బాధ్యతలను స్వీకరించాలని ఆయన తెలిపారు. ఇరాన్ నుంచి భవిష్యత్తులో ఎదురయ్యే ముప్పును తిప్పికొట్టేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు ట్రంప్.






