- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శత్రువుల కళ్లు బైర్లుకమ్మే దెబ్బ కొట్టాం: సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేని
ఇరాన్ కొత్త సంవత్సరం ‘నౌరోజ్’ సందర్భంగా సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేని సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియా (West Asia)లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేని (Mojtaba Khamenei) శత్రువులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ కొత్త సంవత్సరం ‘నౌరోజ్’ వేడుకల సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందేశాన్ని ఇరాన్ అధికారిక మీడియా ప్రసారం చేసింది. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ఇరాన్ శత్రువులు పూర్తిగా ఓడిపోయారని ఆయన ప్రకటించారు.
ఇరాన్ అగ్రశ్రేణి నాయకులను (Top Leaders) హతమార్చడం వల్ల దేశాన్ని లొంగదీసుకోవచ్చని శత్రువులు భావించారని, కానీ అది వారి ఘోర తప్పిదమని పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వాన్ని కూలదోయొచ్చని శత్రువులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, ఇప్పుడు ఆ విషయం వారికి కూడా అర్థమైందని వ్యాఖ్యానించారు. శత్రువుల కళ్లు బైర్లుకమ్మేలా మేము దెబ్బ కొట్టామని ప్రకటించారు. ఇరాన్ ప్రజల మధ్య ఉన్న అచంచలమైన ఐకమత్యమే దేశాన్ని కాపాడిందని, ఏ శక్తీ తమను విడదీయలేదని మొజ్తబా ఖమేని కొనియాడారు.






