- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన ఆ ఇద్దరు మహిళలు మృతి
బలూచిస్తాన్ లో పాకిస్థాన్ మారణహోమం సృష్టిస్తోంది. అక్కడ పాక్ ఆర్మీ వర్సెస్ బలూచ్ మిలిటెంట్ల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. బలూచిస్తాన్ లో దాడులకు పాల్పడుతున్న మిలిటెంట్లను పాక్ మిలటరీ ఏరిపారేస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: బలూచిస్తాన్ లో పాకిస్థాన్ మారణహోమం సృష్టిస్తోంది. అక్కడ పాక్ ఆర్మీ వర్సెస్ బలూచ్ మిలిటెంట్ల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. బలూచిస్తాన్ లో దాడులకు పాల్పడుతున్న మిలిటెంట్లను పాక్ మిలటరీ ఏరిపారేస్తోంది. ఇప్పటి వరకు 92మంది బలుచిస్తాన్ మిలిటెంట్లను హతమార్చినట్టు పాక్ ఆర్మీ ప్రకటించింది. తమ ఆపరేషన్ లో 15మంది సెక్యూరిటీ సిబ్బంది, 18 మంది సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది. కాగా పాక్ ఆర్మీ చేతిలో ప్రాణాలు కోల్పోయినవారిలో ఆర్మీకి చుక్కలు చూపించిన ఇద్దరు మహిళలు సైతం ఉన్నారు.
బలూచ్ పోరాటంలో ఫిదాయిన్ మహిళా ఆత్మాహుతి దళాలు ఎంతో కీలకంగా పనిచేస్తుండగా.. అందులోని ఆసిఫా మెంగల్ 24 అనే మహిళ జనవరి 31న నోష్కీలోని పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని కారు బాంబు పేల్చింది. ఈ దాడిలో ఆసిఫా మరణించినట్టు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. మరో మహిళా ఫిదాయా హవా బలూచ్ కూడా గ్వాదర్ ఫ్రంట్ లో పాకిస్థాన్ సైన్యంతో పోరాడుతూ వీరమరణం పొందినట్టు బలూచ్ ఆర్మీ తెలిపింది. మరోవైపు ఇప్పటి వరకు బలూచ్ ఆర్మీ దాడుల్లో దాదాపు 200 మంది ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం అందుతోంది.
బలూచిస్తాన్ పాక్ మధ్య గొడవలు ఎందుకు
బలూచిస్తాన్ పాకిస్తాన్ లో అతిపెద్ద ప్రావిన్స్ గా ఉండగా దేశ భూభాగంలో ఇది సుమారు 44శాతం ఉంది. 1947లో పాకిస్థాన్ దేశం ఏర్పడినప్పుడు బలూచిస్తాన్ లోని కలాత్ రాజ్యం స్వతంత్రంగా ఉండాలని కోరుకుంది. కానీ ముహమ్మద్ అలీ జిన్నా ఒప్పందం చేసి తరవాత సైన్యాన్ని పంపి బలూచిస్తాన్ ను బలవంతంగా విలీనం చేసుకున్నారు. దీనిని బలూచ్ ప్రజలు జిన్నా ద్రోహం అని అభివర్ణిస్తూ అప్పటి నుండి స్వతంత్య్ర ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఆర్థిక అసమానతలు, వనరుల దోపిడి, రాజకీయదోపిడి, పేదరికంతో ఇబ్బందిపడుతున్నారు. కాబట్టి పాక్ నుండి విడిపోయేందుకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ పేరిట పాకిస్థాన్ ఆర్మీపై దాడులు చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో బలూచ్ ప్రజలు భారత్ కు మద్దతిచ్చారు.






