సీన్ రివర్స్.. యువకుడి నగ్న వీడియోలతో అమ్మాయి రోజూ అలా చేస్తూ..!!

1442
woman harassing a man on social media

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచం చిన్నది అయిపోయింది. కొందరు దీనిని మంచి కోసం ఉపయోగిస్తుంటే… మరి కొందరు నేరాలకు అడ్డాగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా ఈజీ మనీకి వేదికగా కూడా మారిపోయింది ఈ సోషల్ మీడియా. చాలా కేసుల్లో అబ్బాయిలు నెట్టింట అమ్మాయిల్ని రకరకాల వేధింపులకు గురి చేయడం చూశాం, విన్నాం. కానీ ఈమధ్య సీన్ రివర్స్ అయింది. కొందరు కిలేడీస్ అబ్బాయిల వీక్ నెస్ తో ఆడుకుంటూ… అందాలను ఎరగా వేసి రకరకాల వేధింపులకు గురి చేస్తున్నారు.

ఇప్పుడు అలాంటి కేసు ఒకటి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. ఆ కంప్లైంట్ వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ లో నివసిస్తూ ఎలక్ట్రీషియన్ గా పని చేస్తోన్న ఓ యువకుడికి ఫేస్బుక్ లో సాక్షి వర్మారెడ్డి పేరుతో ఓ యువతి పరిచయమైంది. వారి పరిచయం కాస్తా స్నేహంగా మారింది. దీంతో ఇద్దరూ వాట్సాప్ కాంటాక్ట్స్ షేర్ చేసుకుని అందులో చాట్ చేయడం మొదలెట్టారు.

కారులోనే విద్యార్థిపై లేడీ టీచర్ అత్యాచారం

ఇక ఈ రిలేషన్ ముదిరాక అమ్మడు అసలు అస్త్రం బయట పెట్టింది. రొమాంటిక్ చాట్స్ స్టార్ట్ చేసి, గురుడు లైన్లో పడగానే న్యూడ్ వీడియోస్ పంపింది. నీ న్యూడ్ వీడియోస్ కూడా పంపు అని ఆమె అడగడంతో రెచ్చిపోయిన కుర్రాడు… ఆలోచించకుండా తన న్యూడ్ వీడియోస్ పంపేశాడు. వీడియోస్ తనకి చేరగానే అసలు ట్విస్ట్ ఇచ్చింది మాయలేడి.

తాను చెప్పినట్టు చేయకపోతే వీడియోలు ఫేస్బుక్ లో పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టింది. అంతటితో ఆగకుండా శాంపిల్ చూపిస్తానంటూ కొంతమందికి షేర్ కూడా చేసేసింది. డబ్బు కూడా డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు, సూసైడ్ చేసుకుంటానంటూ సదరు యువకుడిని టెన్షన్ కు గురి చేస్తూ వస్తోంది. ఇలా రోజుకో షాకిస్తూ అతనిని భయభ్రాంతులకు గురి చేస్తోంది. మొత్తానికి కిలాడి షాక్ నుండి తేరుకున్న యువకుడు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..