కారులోనే విద్యార్థిపై లేడీ టీచర్ అత్యాచారం

by  |
Lady teacher rape
X

దిశ, వెబ్‌డెస్క్ : తల్లిదండ్రుల తర్వాత గురువుకే స్థానం ఉంటుంది. విద్యార్థికి విద్యా బుద్దులు చెప్పి ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన ఓ టీచర్ దారి తప్పింది. స్టూడెండ్‌పై మనసు పారేసుకుంది. ఒంటరిగా కారులో తీసుకెళ్లి బాలుడితో లైంగిక కోరికలు తీర్చుకుంది. అతడికి న్యూడ్ ఫొటోలు, మెసేజ్ లు చేస్తూ తరచూ శృంగారంలో మునిగి తేలింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..

ఫ్లోరిడాలోని డేడి కౌంటిలో ఉన్న హియాలియా మిడిల్ స్కూల్‌లో బ్రిటనీ లోపెజ్ ముర్రె (31) డ్రామా టీచర్‌గా పని చేస్తోంది. అక్కడ నాలుగేళ్లుగా విధులు నిర్వహిస్తోన్న ముర్రె.. అదే పాఠశాలకు చెందిన 14 ఏళ్ల బాలుడిపై మనసు పడింది. ప్రస్తుతం బాలుడు హైస్కూల్ లో విద్యనభ్యసిస్తుండగా.. టీచర్ ముర్రె అతడిని బాస్కెట్ బాల్ ప్రాక్టిస్‌లో కలిసేది. టీచర్ ఆ విద్యార్థిని అక్కడి నుంచి మైదాన ప్రాంతానికి తీసుకెళ్లి కారులోనే లైంగిక చర్యలకు పాల్పడేది.

అంతేకాక బాలుడి మొబైల్‌కు తన న్యూడ్ ఫోటోలు సెండ్ చేయడంతోపాటు అసభ్యకరంగా మెసేజ్‌లు చేస్తూ అతడిని శృంగారానికి ప్రేరేపించేది. అయితే బాలుడి మొబైల్‌ను ఓ రోజు అతడి సోదరి చూసింది. షాక్ తిన్న ఆమె వెంటనే విషయాన్ని తండ్రి దృష్టికి తెచ్చింది. ఫోన్‌ను పరిశీలించిన తండ్రి ఖంగుతిన్నాడు. దానిలో బాలుడితో టీచర్ నగ్న ఫొటోలు, శృంగారంలో పాల్గొంటున్న ఫొటోలు ఉండడంతో కుమారుడిని నిలదీశాడు. ఆగస్ట్ నుంచి టీచరే తనపై బలవంతంగా లైంగిక దాడులకు పాల్పడుతుందని తెలిపాడు. దీంతో టీచర్ ముర్రెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాలుడి తండ్రి. పోలీసులు ముర్రెను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు విచారణలో ఉన్నది.


Next Story

Most Viewed