- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముఖ్యమంత్రి వా..లేక హిట్లర్ వా..
సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్ మాదిరి తయారైండని బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత తన్నీరు హరీష్ రావు అన్నారు.

దిశ, సిద్దిపేట ప్రతినిధి/ చిన్నకోడూరు : సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్ మాదిరి తయారైండని బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత తన్నీరు హరీష్ రావు అన్నారు. కాళేశ్వరం వద్ద కన్నేపల్లి బ్యారేజ్ నుంచి తక్షణమే నీళ్లు విడుదల చేసి రైతుల్ని ఆదుకోవాలనే డిమాండ్ తో అన్నపూర్ణ సాగర్ నుంచి రంగనాయక సాగర్ రిజర్వాయర్ వరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ... కేసీఆర్ కు పేరు వస్తుందని 70 టీఎంసీల నీళ్లను సీఎం రేవంత్ రెడ్డి కిందికి వదిలిపెడుతుంటే ఆంధ్ర బాబు పట్టి సీమ ద్వారా నీళ్లు ఒడిసి పడుతున్నాడన్నారు. ఆ నీళ్లతో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, ఇతర రిజర్వాయర్లు నిండుగా ఉండేవి అన్నారు. అనంతగిరి ప్రాజెక్టులోకి నీళ్లు ఎంతకుంటే అంతగిరి పోచమ్మ తల్లి, మల్లన్న సాగర్ నింపకుంటే మల్లన్న దేవుడు భరతం పడుతుందని, రంగనాయక సాగర్ కు నీళ్లు ఎతకుంటే రంగనాయక స్వామి రోగం కుదురుస్తాడని, కొండపోచమ్మ సాగర్ నింపకుంటే కొండ పోచమ్మ తల్లికి కోపం వస్తే సీఎం రేవంత్ రెడ్డి మాడి మసి అయిపోతావని హరీష్ రావు హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పడం వల్లే రాష్ట్రానికి అరిష్టం పట్టి కరువు వచ్చిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువులు, సాగు నీరు, అభివృద్ధి కి కరువు వచ్చిందన్నారు. ధాన్యం కొనుగోలు సందర్భంగా తరుగు తీస్తే తోలు తీస్తా అని హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి దళారులు మిల్లర్ల చేతిలో తోలు బొమ్మగా మారాడన్నారు. ఎల్లంపల్లిలో నీళ్లు లేకుంటే ఎంటీపీసీ, సింగరేణి లో కరెంట్ ఉత్పత్తి నిలిచిపోతుంది, హైదరాబాద్ కు తాగునీరు అందించే పరిస్థితి ఉండదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రైతుల పాలిట ఆపద్బాంధవుడు గా మారితే.. నేటి సీఎం రేవంత్ రెడ్డి రైతుల పాలిట రాక్షసుడిగా మారాడని ధ్వజమెత్తారు. అన్నారం దుద్దిళ్ల నింపితే భద్రాచలం రాముడి గుడికి ఏ ప్రమాదం ఉండదన్నారు. భేషజాలు మాని కన్నెపల్లి పంపులను ఆన్ చేసి రైతాంగానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కరువు వస్తే తిరిగి వలసలు ప్రారంభమయ్యే ప్రమాదం ఉందన్నారు. రైతుల పాదయాత్రతో రేవంత్ రెడ్డి కనువిప్పు కలగాలన్నారు. రైతులకు కోపం వస్తే జరిగే పరిణామాలకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాల్సి వస్తుందని హరీష్ రావు హెచ్చరించారు.
నీళ్లు ఎత్తి పోస్తవా లేదా ఎత్తి పారేయ్య మంటావా
సీఎం రేవంత్ రెడ్డి తీరు కన్నతల్లి దయ్యం అయిన చందానా ఉన్నట్లు ఉందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. ఆంధ్ర వాళ్లు పట్టి సీమ ప్రాజెక్టు నుంచి పట్టే అని నీళ్లు ఎంతుకుంటుంటే కాంగ్రెస్ వాళ్లు పట్టి లేనట్లు చూస్తున్నారని మండిపడ్డారు. ప్రకృతి కరువు కాదు సీఎం రేవంత్ రెడ్డి వికృతి తీసుకొచ్చిన కరువు అన్నారు. మూడు నెలలు ప్రాజెక్టును అప్ప జెపితే తెలంగాణకు సాగునీరు అందిస్తానని హరీష్ రావు సవాల్ విసిరితే సీఎం రేవంత్ రెడ్డి ముంగి లెక్కన దాక్కున్నాడన్నారు. భద్రాచలం మునిగిపోతుంది.. ప్రాజెక్టులు కొట్టుకు పోతాయని అబద్దపు మాటాలు మాట్లాడుతున్నారన్నారు. కన్నెపల్లి నుంచి సీఎం రేవంత్ రెడ్డి నీళ్లు ఎత్తి పోస్తవా లేదా ఎత్తి పారేయ్య మంటావా అని దేశపతి శ్రీనివాస్ అన్నారు.






