చై-సామ్ హార్ట్ బ్రేకింగ్ నిర్ణయం..పెళ్లి రోజే విడాకుల ప్రకటన..?

by  |

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా ఉన్న నాగ చైతన్య -సమంతల విడాకుల వ్యవహారం క్లైమాక్స్ కి చేరే సమయం ఆసన్నమైంది. అందరూ మెచ్చిన లవ్ కపుల్ విడిపోతున్నారన్నా రూమర్స్ రావడంతో అటు అక్కినేని అభిమానులు, ఇటు సామ్ ఫ్యాన్స్ ఈ వార్తలు నిజమా..? కాదా అని అయోమయంలో కలవరపడుతున్న విషయం తెలిసిందే. ఇక గత కొన్ని రోజులుగా సామ్, చైతూ ల డివోర్స్ లపై తెగ ప్రచారం జరుగుతున్నా.. నాగార్జున ఫ్యామిలీ నుంచి కానీ, చైతు- సామ్ నుంచి కానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ఈ వ్యవహారం నిజమేమో అని ప్రేక్షక వర్గాలు గుస గుసలాడుతున్నాయి.

కోర్టులో విడాకుల కేసు నడుస్తోందని, కౌన్సిలింగ్ స్టేజి దాటి సామ్ కి భరణం కోట్లలలో ఇస్తున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఇక వీటితో పాటు అభిమానులకు మరో తాజా వార్త బయటికి రావడం సంచలనంగా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ విడాకుల నిర్ణయాన్ని సైతం త్వరలోనే ప్రకటిచేందుకు అక్కినేని కుటుంబం ముమూర్తం ఖరారు చేశారని తెలుస్తోంది.

ఎప్పటినుంచో అనుకొంటున్నట్టుగా ఈ వార్తలకు సామ్- చై వివాహ వేడుకనే వేదికగా మారనుంది. ఈ అక్టోబర్ 7 కి నాగచైతన్య, సామ్ ల వివాహం జరిగి నాలుగేళ్లు పూర్తవనుండగా.. వారి వైవాహిక జీవితానికి కూడా అదే రోజు శుభం కార్డు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వారి విడాకులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు సిద్ధమైనట్లు, అదే రోజు భరణాన్ని కూడా రివీల్ చేసే అవకాశం ఉందని నెట్టింట చర్చ జరుగుతోంది. వారి పెళ్లి రోజైన అక్టోబర్ 7 వ తేదీనే వారి నుంచి బ్యాడ్ న్యూస్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అయితే, దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక ఈ వార్తలపై ఎవరూ స్పందించకపోవడంతో.. నెటిజన్లు కూడా సందిగ్ధంలో ఉన్నారు. మరోపక్క వారి పెళ్లి రోజు మంచి న్యూస్ రావాలని, సామ్ – చై విడిపోవడం లేదన్న మాట రావాలని అభిమానులు ఆశపడుతున్నారు. మరి ఈ అక్కినేని జంట తమ పెళ్లి రోజు ఎలాంటి వార్తను చెప్పనున్నారో అని అభిమానులందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

https://www.facebook.com/Dishacinema

వాహ్.. తడి అందాలతో కాక రేపుతున్న Naina Ganguly

మాల్దీవుల్లో హాట్ లుక్స్‌తో దర్శనమిచ్చిన బాలీవుడ్ నటి..Parineeti Chopra

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed