- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్ణాటక కేబినెట్ పోర్ట్‌ఫోలియోస్ అవుట్: CM వద్దే ఆర్థిక శాఖ, హోంమంత్రిగా ప్రియాంక్ ఖర్గే
కర్ణాటకలో మంత్రుల శాఖల కేటాయింపు ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది.

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గానికి సంబంధించి మంత్రుల శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అధికారికంగా మంత్రుల శాఖల వివరాలతో కూడిన ప్రత్యేక గెజిట్‌ను విడుదల చేశారు. ఈ కేటాయింపులలో సీఎం డీకే శివకుమార్ కీలకమైన ఆర్థిక శాఖను తన వద్దే ఉంచుకోగా, పలువురు సీనియర్ నాయకులకు కీలక బాధ్యతలు దక్కాయి.
సీఎం, డిప్యూటీ సీఎంల శాఖలు ఇవే..
అత్యంత కీలకమైన ఆర్థిక (Finance), కేబినెట్ వ్యవహారాలు, పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, ఇంటెలిజెన్స్ విభాగంతో పాటు మరే ఇతర మంత్రికి కేటాయించని మిగిలిన అన్ని శాఖలను ముఖ్యమంత్రి తన వద్దే పెట్టుకున్నారు. ఇక డిప్యూటీ సీఎం జి.పరమేశ్వరకు రెవెన్యూ, క్రీడా శాఖల (Sports) బాధ్యతలను అప్పగించారు. అత్యంత కీలకమైన హోం శాఖ, ఐటీ & బీటీ (IT & BT), ఈ-గవర్నెన్స్ బాధ్యతలను ప్రియాంక్ ఖర్గే దక్కించుకున్నారు. బెంగళూరు నగర ప్రణాళిక, అభివృద్ధికి సంబంధించిన అత్యంత కీలకమైన గ్రేటర్ బెంగళూరు డెవలప్‌మెంట్, బెంగళూరులోని అన్ని నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ సిటీ కార్పొరేషన్లతో కూడిన శాఖల బాధ్యతలను శ్రీకృష్ణ బైరగౌడ చేపట్టనున్నారు. ఇక మాజీ సీఎం సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర సిద్ధరామయ్య పట్టణాభివృద్ధి (Urban Development) శాఖ బాధ్యతలను కేటాయించారు.






