- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం
తిరుమలలో 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు; టోకెన్ లేని వారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 75,691 మంది.

దిశ, వెబ్ డెస్క్: వేసవి సెలవులు ముగుస్తుండటంతో తిరుమల కొండపై భక్తుల రద్ధీ భారీగా పెరిగిపోయింది. కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో ఎక్కడ చూసిన భక్తుల రద్దీ కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో గల 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో టైం స్లాట్ టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి సర్వదర్శనం (ఉచిత దర్శనం) లభించడానికి సుమారు 18 గంటల సుదీర్ఘ సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే తిరుమలలో నిన్న (గురువారం) ఒకే రోజు మొత్తం 75,691 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి తమ మొక్కులు చెల్లించుకునేందుకు గానూ 39,050 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక భక్తులు స్వామివారికి సమర్పించుకున్న కానుకల ద్వారా నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.16 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా క్యూలైన్లలో వేచి ఉన్న వారికి టీటీడీ సిబ్బంది నిరంతరాయంగా పాలు, తాగునీరు, అన్నప్రసాదాలను అందిస్తున్నారు.






