మాల్దీవుల్లో హాట్ లుక్స్‌తో దర్శనమిచ్చిన బాలీవుడ్ నటి..Parineeti Chopra

381

దిశ సినిమా: ఇండియన్ సెలబ్రిటీలకు ముఖ్యంగా బాలీవుడ్ నటులకు ఇష్టమైన హాలీడే డెస్టినేషన్ మాల్దీవులు.. కొద్దిగా విరామం దొరికితే చాలు వెంటనే అక్కడకు చెక్కేస్తుంటారు. కాగా ప్రస్తుతం పరిణీతి చోప్రా కూడా ఆ జాబితాలో చేరిపోయింది. అయితే హీరోయిన్‌గా సరైన బ్రేక్ లభించకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం మంచి ఫాలోయింగ్ పెంచుకున్న ఈ భామ.. తాజాగా తన అందాలను ఎలివేట్ చేస్తూ.. హాట్ లుక్‌లో ఓ పిక్ పోస్ట్ చేసి అభిమానులకు ట్రీట్ ఇచ్చింది.

రెడ్ కట్ నెక్ బికినీ ధరించి బీచ్‌లో ఏర్పాటు చేసిన చెక్కబల్లపై విశ్రాంతి తీసుకుంటున్న ఈ లుక్‌లో కెమెరా వైపు తల తిప్పగా.. మరో లుక్‌లో వైట్ జంప్‌ సూట్‌తో పాటు నడి ఎండలో నల్లటి కూలింగ్ గ్లాసెస్‌తో దర్శనమిచ్చిన పరిణీతి (Parineeti Chopra) .. గాలి, సూర్యుడి వెలుతురు, సముద్ర అలల సవ్వడిని ఆస్వాదిస్తున్నట్లు తెలిపింది. ఇక ఈ చిత్రాలతో పాటు సెలవుల్లో తను ఎంజాయ్ చేస్తున్న మరికొన్ని వీడియోలను తన ఇన్స్టా గ్రామ్‌లో పోస్ట్ చేయగా.. తన ఆనందాన్ని చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..