- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తీరం దాటిన ‘మొంథా’ తుపాను.. ఊపిరి పీల్చుకున్న తీర ప్రాంత ప్రజలు
బంగాళాఖాతంలో ఏర్పడిన భయానక ‘మొంథా’ (Montha Cyclone) మంగళవారం అర్ధరాత్రి తీరం దాటింది.

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన భయానక ‘మొంథా’ (Montha Cyclone) మంగళవారం అర్ధరాత్రి తీరం దాటింది. మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నరసాపురానికి దగ్గరలో అర్థరాత్రి 12.30 తర్వాత తీరం దాటినట్లు భారత వాతవరణ శాఖ వెల్లడించింది. అయినా తుపాను ప్రభావంపై ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో తీవ్రంగానే ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 12 కి.మీ వేగంతో తుపాను కదిలింది. ‘మొంథా’ ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా ప్రయాణించి బుధవారం మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్ వద్ద మరింత బలహీన పడనుంది. ఈ నేపథ్యంలోనే గంటకు 85 కి.మీ నుంచి 95 కి.మీ వేగంతో ఈదురుగాలలు వీయనున్నాయి. కాగా, మొంథా తుపాను ప్రభావంతో గడిచిన 12 గంటల్లో నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా 23 సెం.మీ, ఉలవపాడులో 17 సెం.మీ, చీరాలలో 15 సెం.మీ వర్ష పాతం నమోదైంది. బుధవారం కోస్తా ఆంధ్రా, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. తుపాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.
Read More..






