- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొంథా ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, నంద్యాల, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలుల ధాటికి మచిలీపట్నంలో..

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుపాన్ మంగళవారం అర్థరాత్రి 11.30 గంటల నుంచి 12.30 గంటల మధ్య మచిలీపట్నం - కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో తిరం దాటిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఇది వాయువ్య దిశగా కదులుగా రానున్న 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీన పడుతుందని పేర్కొంది. తుపాను తీరం దాటడంతో సముద్ర తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.
కాగా.. నేడు కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని APSDMA సూచించింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, నంద్యాల, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలుల ధాటికి మచిలీపట్నంలో విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేది వద్ద సముద్రం ముందుకు రావడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఇటు విజయవాడలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ప్రధాన రహదారులపై భారీగా వర్షపునీరు నిలిచిపోయింది. భారీ వర్షాల నేపథ్యంలో నేడు కూడా పలు జిల్లాల్లో విద్య, వ్యాపారసంస్థలు మూతపడ్డాయి. గుంటూరులో భారీ ఈదురుగాలుల ధాటికి భారీ వృక్షాలు కూలిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లాలో బహుదా, మహేంద్ర తనయ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా.. బహుదా నదికి మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. విజయనగరం జిల్లా మెంటాడలో కురిసిన భారీ వర్షానికి కేజీబీవ బాలికల పాఠశాలలోకి భారీగా వరదనీరు చేరింది. దీంతో 208 మంది విద్యార్థినులను జడ్పీ హైస్కూలుకు తరలించారు.
ఏపీ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
వాతావరణ శాఖ ఏపీలో 14 జిల్లాలకు ఆరెంజ్, 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కడప, కర్నూల్, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నేడు కూడా భార వర్షసూచన ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Read More..
తీరం దాటిన ‘మొంథా’ తుపాను.. ఊపిరి పీల్చుకున్న తీర ప్రాంత ప్రజలు






