భారత్-కివీస్‌ రెండో టెస్టుపై కరోనా ఎఫెక్ట్.. కీలక ప్రకటన

by  |
భారత్-కివీస్‌ రెండో టెస్టుపై కరోనా ఎఫెక్ట్.. కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా ప్రభావం మరోసారి క్రికెట్‌పై పడింది. కరోనా కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఒమిక్రాన్ ఎఫెక్ట్ భారత్-న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌పై పడింది. కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

ఇదిలా ఉండగా భారత్-కివీస్ మధ్య డిసెంబర్ 3వ తేదీ నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్టుపై ఒమిక్రాన్ ఎఫ్టెక్ చూపించింది. రెండో టెస్టులో ప్రేక్షకులకు లిమిటెడ్‌గానే స్టేడియంలోకి అనుమతి ఇవ్వనున్నట్టు ముంబై క్రికెట్‌ అసోషియేషన్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. 33 వేలు ఉన్న వాంఖడే స్టేడియం సామర్థ్యంలో 25 శాతం మందికే అనుమతి ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు. కరోనా ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా కొవిడ్ నిబంధనలను పాటిస్తూనే మ్యాచ్‌ నిర్వహించనున్నామని అధికారులు స్పష్టం చేశారు.

ND vs NZ : రాహుల్ ద్రావిడ్ క్రీడా స్ఫూర్తి.. ప్లేయర్స్, మాజీల ప్రశంసలు


Next Story

Most Viewed