‘పెద్ది’కి సూపర్ సాలిడ్ రివ్యూ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా

by Pulgam srinivas |

సందీప్ రెడ్డి వంగా 'పెద్ది' ప్రీమియర్ షోను ఏఎంబీ సినిమాస్‌లో చూసి “సినిమా బాగుంది” అంటూ స్పందించారు.

‘పెద్ది’కి సూపర్ సాలిడ్ రివ్యూ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా
X

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన ‘పెద్ది’ చిత్రం ఈరోజు అనగా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. విడుదలకు ముందే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనగా, నిన్న రాత్రి నుంచే పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ షోలకు సినీ ప్రముఖులు కూడా హాజరై సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక టాలీవుడ్ స్టార్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నిన్న రాత్రి హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో ‘పెద్ది’ ప్రీమియర్ షోను వీక్షించారు. సినిమా చూసిన అనంతరం థియేటర్ బయట మీడియా ప్రతినిధులు మూవీ ఎలా ఉందని ప్రశ్నించగా, ఆయన “సినిమా బాగుంది” అంటూ స్పందించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలాగే సందీప్ రెడ్డి వంగా మాత్రమే కాకుండా, ప్రముఖ దర్శకుడు రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళి సహా మరికొందరు సినీ ప్రముఖులు కూడా ‘పెద్ది’ ప్రీమియర్ షోను వీక్షించారు.

Next Story