IND vs NZ : రాహుల్ ద్రావిడ్ క్రీడా స్ఫూర్తి.. ప్లేయర్స్, మాజీల ప్రశంసలు

by  |
IND vs NZ : రాహుల్ ద్రావిడ్ క్రీడా స్ఫూర్తి.. ప్లేయర్స్, మాజీల ప్రశంసలు
X

దిశ, వెబ్‌డెస్క్ : భారత్- న్యూజిలాండ్ మధ్య కాన్పూర్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్ ఎంతో రసవత్తరంగా ముగిసింది. న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ చేతులెత్తేసినప్పటికీ లోయర్ ఆర్డర్ రాణించడంతో మొదటి టెస్టు డ్రాగా ముగిసింది. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ ముగిసిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సిరీస్‌తో భారత జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ ద్రావిడ్.. తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

కాన్పూర్‌ తొలి టెస్టు మ్యాచ్‌ కోసం ద్రావిడ్ పిచ్‌ను ప్రత్యేకంగా తయారు చేయించాడు. ఏ హోమ్ టీమ్ అయినా సరే గెలుపు కోసమే ప్రయత్నిస్తుంది. అందుకు వారికి తగిన విధంగా పిచ్‌లను తయారు చేయించుకుంటుంది. కానీ, కోచ్ అందుకు భిన్నంగా ఆలోచించి తన మార్క్ చాటుకున్నాడు. ఇరుజట్లకు పిచ్‌ అనుకూలించేలా తయారు చేయించి మాజీ మన్ననలు అందుకున్నాడు. ఇందుకోసం శివకుమార్‌ నేతృత్వంలోని గ్రీన్‌ పార్క్‌ గ్రౌండ్ సిబ్బందికి రూ. 35 వేలు అందించడం విశేషం. ఈ విషయాన్ని మ్యాచ్‌ ముగిసిన అనంతరం ఉత్తర్‌ప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధికారికంగా ప్రకటించింది.

ద్రావిడ్ మార్క్..

కొన్నేళ్లుగా టెస్టు మ్యాచ్‌లు 3-4 రోజుల్లోనే ముగిసిపోతున్నాయి. పిచ్‌లు అతిధ్య జట్లకు కలిసిరాకపోవడంతో బ్యాట్స్‌మెన్స్ చేతులెత్తేస్తున్నారు. దీంతో హోం టీం టెస్టు మ్యాచ్‌ను అలవోకగా గెలుస్తోంది. అయితే, హోం టీంకు అనుకూలంగా పిచ్‌ను తయారు చేయించి విజయం సాధించడంలో మజా లేదని రాహుల్ ద్రావిడ్ భావించాడు. దీంతో ఇలా తటస్థంగా పిచ్‌ను ఎంచుకున్నాడని.. విశ్లేషకులు సైతం ది వాల్‌ను ప్రశంసిస్తున్నారు. ఈ పిచ్‌పై శ్రేయస్‌ అయ్యర్‌, శుభ్‌మన్‌ గిల్‌, టామ్ లాథమ్‌, విల్‌ యంగ్‌ వంటి యువ బ్యాట్స్‌మెన్స్ రాణించి తన సత్తా చాటారు.

83 Official Trailer Nagarjuna Akkineni ,Ranveer Singh & Kabir Khan


Next Story

Most Viewed