హస్తినాపురం డివిజన్లో కృంగిన మ్యాన్ హోల్

by Batti.Sumithra |

ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ భూఫేష్ గూప్తానగర్ లో రోడ్డు పై కృంగిన ప్రమాదకర మ్యాన్ హోల్ ను హస్తినాపురం, బీజేపీ డివిజన్ అధ్యక్షులు ఎరుకల మల్లేష్ గౌడ్, స్థానిక బీజేపీ నాయకులతో కలిసి గురువారం, ఉదయం పరిశీలించారు.

హస్తినాపురం డివిజన్లో కృంగిన మ్యాన్ హోల్
X

దిశ, హస్తినాపురం : ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ భూఫేష్ గూప్తానగర్ లో రోడ్డు పై కృంగిన ప్రమాదకర మ్యాన్ హోల్ ను హస్తినాపురం, బీజేపీ డివిజన్ అధ్యక్షులు ఎరుకల మల్లేష్ గౌడ్, స్థానిక బీజేపీ నాయకులతో కలిసి గురువారం, ఉదయం పరిశీలించారు. ఈ గుంత కారణంగా గత మూడు నెలల నుంచి వాహనదారులు, ఇంటి ముందు ఆడుకునే చిన్నారులు అక్కడి నుంచి వెళ్లే పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు సంబంధిత హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బి (HMWSSB) అధికారుల దృష్టికి స్థానికులు ఈ సమస్యను తీసుకెళ్లారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించి బస్తీ వాసులకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని కోరారు.

Next Story