- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అఫ్గాన్‌తో వన్డే సిరీస్: రోహిత్, విరాట్, హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్‌కు నిరాశ
త్వరలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే (ODI) సిరీస్‌కు ముందు టీమిండియాకు పెద్ద షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఇప్పటికే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా ఈ సిరీస్ మొత్తానికి దూరం కాగా.. ఇప్పుడు మరో సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ ఆడటంపై కూడా తీవ్ర సందిగ్ధత నెలకొంది.

దిశ, వెబ్‌డెస్క్: త్వరలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే (ODI) సిరీస్‌కు ముందు టీమిండియాకు పెద్ద షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఇప్పటికే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా ఈ సిరీస్ మొత్తానికి దూరం కాగా.. ఇప్పుడు మరో సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ ఆడటంపై కూడా తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో తగిలిన హ్యామ్ స్ట్రింగ్ (Harmstring) గాయం కారణంగా రోహిత్ ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని బీసీసీఐ (BCCI) వర్గాల ద్వారా బలమైన వార్తలు వస్తున్నాయి. శ్రీలంకతో సిరీస్ తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్న సీనియర్ ఆటగాళ్లు ఈ సిరీస్‌లో ఫామ్‌లోకి రావాలని భావించారు. కానీ గాయాల సమస్యలు ఇప్పుడు మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతున్నాయి.
కోహ్లీ అవుట్.. రోహిత్ డౌట్..
ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్‌లో టైటాన్స్‌తో తలపడిన సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ విరాట్ కోహ్లీ తీవ్రమైన హ్యామ్ స్ట్రింగ్ నొప్పితో బాధపడ్డాడు. రన్నింగ్ చేయడంలో ఇబ్బంది పడినప్పటికీ జట్టు కోసం కీలక ఇన్నింగ్స్ ఆడ్డాడు. అయితే ఈ గాయం తిరగబెట్టడంతో అతను అఫ్గాన్ సీరీస్ నుండి పూర్తిగా తప్పుకున్నట్లు పీటీఐ (PTI) నివేదించింది. మరోవైపు, ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన రోహిత్ శర్మ కూడా ఐపీఎల్ సీజన్ మధ్యలోనే హ్యామ్ స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు. అందువల్లనే అతను కొన్ని మ్యాచ్లలో కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే పరిమితమయ్యాడు. బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యుల వన్డే జట్టులో రోహిత్ శర్మ పేరు ఉన్నప్పటికీ, అది ఫీట్నెస్ క్లియరెన్స్ సాధించడంపైనే ఆధారపడి ఉంటుందనీ సెలెక్టర్లు ముందే స్పష్టం చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) నిర్వహించే ఫిట్నెస్ పరీక్షల్లో రోహిత్ ఇంకా పూర్తి స్థాయి ప్రమాణాలు అందుకోలేదని తెలుస్తోంది.
హార్దిక్ పాండ్యాపై కూడా నిఘా..
కేవలం రోహిత్ మాత్రమే కాదు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్నెన్ను కూడా బీసీసీఐ నిశితంగా గమనిస్తోంది. ఐపీఎల్ సమయంలో అతనికి లోయర్ బ్యాక్ (నడుము కింది భాగం) పట్టేయడంతో కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాడు. సిరీస్ ప్రారంభానికి ముందు బెంగళూరులో హార్టీకు కూడా ఫిటెనెస్ పీరీక్షలు నిర్వహించనున్నారు. ఈ జట్టుకు శుభ్ మన్ గిల్ వన్డే జట్టుకు సారథ్యం వహించనున్నాడు. జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ వంటి సీనియర్ బౌలర్లకు ఇప్పటికి వర్క్ లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా విశ్రాంతినిచ్చారు. ఒకవేళ రోహిత్ శర్మ తొలి వన్డే నాటికి కోలుకోలేకపోతే, చాలా కాలం తర్వాత వన్డే జట్టులోకి పునరాగమనం చేసిన ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. జూన్ 6 నుంచి న్యూ ఛండీగఢ్‌లో ఇరు జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ జరగనుండగా, జూన్ 13 నుండి ధర్మశాల వేదికగా సిరీస్ ప్రారంభం కానుంది. రోహిత్ కులుకుంటాడో లేదో చూడాలి.






