- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన పార్లమెంట్ భవన్‌లో కేంద్రం కేబినెట్ సమావేశం అయింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) అధ్యక్షతన పార్లమెంట్ భవన్‌లో కేంద్రం కేబినెట్(Union Cabinet) సమావేశం అయింది. ఈ సందర్భంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్(Union Budget 2026-2027)కు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు బడ్జెట్‌కు రాష్ట్రపతి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా తన బృందంతో కలిసి ఆర్థిక మంత్రికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మిఠాయి తినిపించారు. సుస్థిరాభివృద్ధిని కొనసాగిస్తూ.. సంస్కరణలను పరుగులు పెట్టించే లక్ష్యంతోపాటు అంతర్జాతీయ ఒత్తిడులను, సుంకాలను తట్టుకునే చర్యలకు ప్రాధాన్యమిస్తూ 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను రూపొందిచినట్లు సమాచారం. వరుసగా తొమ్మిదోసారి ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆదివారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటం ఇదే తొలిసారి.
Read More..






