- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర బడ్జెట్‌కు రాష్ట్రపతి ఆమోదం.. ఆర్థిక మంత్రికి స్వీట్ తినిపించిన ద్రౌపది ముర్ము
మరికొద్ది సేపట్లో కేంద్ర బడ్జెట్ 2026-27ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్ట నుంది.

దిశ, వెబ్ డెస్క్: మరికొద్ది సేపట్లో కేంద్ర బడ్జెట్ 2026-27ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) పార్లమెంట్లో ప్రవేశపెట్ట నుంది. ఈ క్రమంలో ఉదయం కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ సందర్భంగా ఆమె వెంట కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఉన్నారు. బడ్జెట్ ప్రతులపై రాష్ట్రపతి ఆమోదం (President's approval) పొందిన అనంతరం, నిర్మలా సీతారామన్ బృందానికి రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక మంత్రి దేశాధినేతను కలవడం ఒక కీలకమైన రాజ్యాంగ సంప్రదాయంగా వస్తోంది. ఇక్కడి నుంచే బడ్జెట్ ప్రతులతో మంత్రి నేరుగా పార్లమెంటుకు చేరుకుంటారు. ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆర్ధికమంత్రికి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. సరిగ్గా ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవ్వగానే నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను సభలో ప్రవేశ పెడతారు.
Read More..






