- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Budget 2026-2027: ఈసారి కంజీవరం చీరలో నిర్మలమ్మ.. ప్రత్యేకత ఏంటంటే?
బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు అంటే బడ్జెట్‌తో పాటు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఏ చీరలో వస్తారో అన్నదానిపై సైతం ఆసక్తి ఉంటుంది. దానికి కారణం నిర్మలమ్మ చీరలు భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంటాయి.

దిశ, వెబ్ డెస్క్: బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు అంటే బడ్జెట్‌తో పాటు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఏ చీరలో వస్తారో అన్నదానిపై సైతం ఆసక్తి ఉంటుంది. దానికి కారణం నిర్మలమ్మ చీరలు భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంటాయి. అంతేకాకుండా బడ్జెట్ సమావేశాల్లో నిర్మలా సీతారామన్ చేనేత చీరలతో దర్శనమిస్తూ ఉంటారు. దీంతో ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆమె ఎలాంటి చీర కట్టుకుని వస్తారని చాలా మంది ఎదురుచూస్తున్నారు.
కాగా ఈసారి కూడా చేనేత చీరలోనే దర్శనం ఇచ్చారు. నిర్మలమ్మ కంజీవరం చీరలో రాగా గోల్డ్, బ్లాక్ కలర్ అంచులతో కనిపించింది. అదే విధంగా పొడవాటి పసుపు రంగు బ్లౌజ్ ధరించి, ఆపై శాలువా సైతం కప్పుకున్నారు. ఇక ఈ చీర కట్టుకోవడం వెనుక మరో ఆసక్తికర విషయం దాగి ఉన్నట్టు కనిపిస్తోంది. త్వరలో తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ తమిళనాడుకు చెందిన కాంజీవరం చీరను కట్టుకుని రావడం ఆసక్తికరంగా మారింది.
Read More..






