లోక్‌సభలో నిర్మలమ్మ చారిత్రాత్మక ప్రసంగం.. రూ. 54.1 లక్షల కోట్లతో పద్దు!

by Malleboina Mahesh |   (  Updated:2026-02-01 05:06:50  IST  )

భారత దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే కీలక ఘట్టం మరికొద్ది సేపట్లో ఆవిష్కృతమవ్వనుంది.

లోక్‌సభలో నిర్మలమ్మ చారిత్రాత్మక ప్రసంగం.. రూ. 54.1 లక్షల కోట్లతో పద్దు!
X

దిశ, వెబ్ డెస్క్: భారత దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే కీలక ఘట్టం మరికొద్ది సేపట్లో ఆవిష్కృతమవ్వనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ఉదయం పార్లమెంట్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ముందుకు బడ్జెట్‌‌ను తీసుకొచ్చారు. అనంతరం కేబినెట్ ఆమోదం తెలిపిన అనంతరం ఆమె లోక్‌సభలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టి ప్రసంగించనున్నారు. నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదవ సారి బడ్జెట్‌ను సమర్పిస్తూ ఈ అరుదైన మైలురాయిని అందుకుంటున్నారు. ఈ ఏడాది బడ్జెట్ పరిమాణం సుమారు రూ. 54.1 లక్షల కోట్లు ఉంటుందని అంచనా, ఇది గత ఏడాదితో పోలిస్తే 7.9 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం రెండు చారిత్రాత్మక సంస్కరణలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తుంది. పరోక్ష పన్నుల వ్యవస్థను మరింత సరళీకరిస్తూ 'జీఎస్టీ 2.0' కింద కేవలం 5 శాతం, 18 శాతం అనే రెండు రేట్ల నిర్మాణాన్ని ప్రతిపాదించనున్నారు. దీనివల్ల సామాన్యులపై నిత్యావసరాల భారం తగ్గనుంది. అదేవిధంగా, 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా విలీనం చేస్తూ తీసుకువచ్చిన సంస్కరణల తర్వాత వస్తున్న మొదటి బడ్జెట్ ఇది. దీని ద్వారా గిగ్ వర్కర్లు, అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత లభించనుంది.

మరోవైపు అంతర్జాతీయ వాణిజ్య సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యతనిచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా భారతీయ ఉత్పత్తులపై అమెరికా 50 శాతం టారిఫ్ విధించిన నేపథ్యంలో, ఎగుమతులను ప్రోత్సహించే దిశగా కీలక చర్యలు చేపట్టనుంది. ఏప్రిల్ 2 వరకు కొనసాగే ఈ బడ్జెట్ సమావేశాలు మొత్తం 65 రోజుల పాటు 30 విడతలుగా జరగనున్నాయి. మధ్యలో ఫిబ్రవరి 13 నుండి మార్చి 8 వరకు వివిధ మంత్రిత్వ శాఖల గ్రాంట్ల పరిశీలన కోసం పార్లమెంటుకు విరామం ఇవ్వనున్నారు.

Read More..

Budget 2026-2027: స్వాతంత్య్ర భారతంలో ఇదే తొలిసారి

Next Story