- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Budget 2026-2027: స్వాతంత్య్ర భారతంలో ఇదే తొలిసారి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ అనంతరం మధ్యాహ్నం 2:30 గంటలకు మీడియా ముందుకు వస్తారు. ఇప్పటివరకు వరుసగా కాకుండా పదిసార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన వ్యక్తుల్లో మొదటి స్థానంలో మొరార్జీ దేశాయ్ ఉండగా.. తొమ్మిదిసార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టి చిదంబరం రెండో స్థానంలో ఉన్నారు. అయితే వరుసగా తొమ్మిదో సారి బడ్జెట్ ప్రవేశ పెడుతున్న వ్యక్తిగా నిర్మలా సీతారామన్ నిలిచారు. దీంతో పాటు భారత దేశ చరిత్రలో ఆదివారం రోజుల బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈసారి ఒక కీలక మార్పుతో రానుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు బడ్జెట్ ప్రసంగాల్లో ప్రధానంగా పార్ట్-ఏకే ఎక్కువ ప్రాధాన్యం దక్కేది. ఆర్థిక పరిస్థితుల సమీక్ష, విధాన దిశ వంటివన్నీ ఎక్కువగా పార్ట్-ఏలోనే ఉండేవి. పార్ట్-బీ మాత్రం సాధారణంగా పన్ను ప్రతిపాదనలు, సాంకేతిక అంశాలకే పరిమితమై, తక్కువ సమయంలో ముగిసేది. అయితే బడ్జెట్ 2026-27లో ఈ సంప్రదాయానికి భిన్నంగా పార్ట్-బీనే ప్రధాన వేదికగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈసారి నిర్మలా సీతారామన్ పార్ట్- బీలో అసాధారణంగా ఎక్కువ సమయం కేటాయించి, తక్షణ విధాన చర్యల తోపాటు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను స్పష్టంగా వివరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Read More..






