Union Budget 2026-2027: చేనేతలకు కేంద్రం భారీ శుభవార్త

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-01 06:03:17  IST  )

2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్నారు.

Union Budget 2026-2027: చేనేతలకు కేంద్రం భారీ శుభవార్త
X

దిశ, వెబ్‌డెస్క్: 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా లోక్‌సభలో ఆమె మాట్లాడుతూ.. చేనేతలకు భారీ శుభవార్త చెప్పారు. టెక్స్‌టైల్ రంగం అభివృద్ధికి కొత్త పథకాలు తీసుకురాబోతున్నట్లు చెప్పారు. దీంతో పాటు దేశంలో కొత్త మెగా టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఖాదీ, హ్యాండ్లూమ్, హస్తకళ ప్రొత్సహానికి ఈ నూతన పథకాలు ఉపయోగపడతాయని అన్నారు. దీంతో పాటు న్యాణ్యత కలిగిన క్రీడా వస్తువుల తయారీ కోసం కూడా నూతన పథకం తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు.

= ఎలక్ట్రానిక్‌ రంగ విస్తరణకు మరిన్ని నిధులు

= కేరళ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల్లో కీలకమైన ఖనిజాల వెలికితీతకు పథకం

= దేశంలో కొత్తగా మూడు రసాయన పార్కుల స్థాపన

= భవన నిర్మాణరంగలో నిర్మాణరంగ పరికరాల అభివృద్ధి

= కంటైనర్‌ తయారీ పరిశ్రమను ప్రోత్సాహం

= జాతీయ ఫైబర్‌ విధానం దిశగా అడుగులు

= రూ.10వేల కోట్లతో వచ్చే ఐదేళ్లకు బయో ఫార్మా శక్తి పథకం

= ఫార్మా విద్య, పరిశోధనకు జాతీయ స్థాయిలో 3 మూడు కొత్త విద్యా సంస్థల స్థాపన

జౌళి రంగ విస్తరణ, ఆధునీకీకరణ, ఉపాధి దిశగా మరిన్ని అడుగులు వేయబోతున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

రూ.10వేల కోట్లతో వచ్చే ఐదేళ్లకు బయో ఫార్మా శక్తి పథకం

Next Story