- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.10వేల కోట్లతో వచ్చే ఐదేళ్లకు బయో ఫార్మా శక్తి పథకం
భారతదేశం కేవలం చౌకైన మందుల తయారీకే పరిమితం కాకుండా, వినూత్న పరిశోధనలు, ఆవిష్కరణలలో ప్రపంచ దేశాలతో పోటీ పడగలదని నిపుణుల అభిప్రాయం.

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) 2026-27 వార్షిక బడ్జెట్‌లో ఫార్మా రంగానికి సంబంధించి కీలక ప్రకటనలు చేశారు. దేశాన్ని గ్లోబల్ బయో-ఫార్మా తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వచ్చే ఐదేళ్ల కాలానికి రూ.10వేల కోట్ల భారీ వ్యయంతో 'బయో ఫార్మా శక్తి' (Bio-Pharma Shakti) అనే నూతన పథకాన్ని ఆమె ప్రతిపాదించారు. ఈ పథకం ద్వారా బయోలాజిక్స్, బయోసిమిలర్స్ వంటి అత్యాధునిక ఔషధాల దేశీయ ఉత్పత్తికి అవసరమైన పటిష్టమైన వ్యవస్థను నిర్మించనున్నారు. అంతేకాకుండా ఫార్మా రంగంలో ఉన్నత స్థాయి విద్య, అత్యాధునిక పరిశోధనలను ప్రోత్సహించేందుకు జాతీయ స్థాయిలో 3 కొత్త విద్యా సంస్థలను NIPER తరహాలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల భారతదేశం కేవలం చౌకైన మందుల తయారీకే పరిమితం కాకుండా, వినూత్న పరిశోధనలు, ఆవిష్కరణలలో ప్రపంచ దేశాలతో పోటీ పడగలదని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యత కలిగిన ఆరోగ్య భద్రత, ఆర్థిక వృద్ధికి ఈ పథకం ఒక మైలురాయిగా నిలవనుంది.






