2026 బడ్జెట్‌లో సామాన్యులకు ఊరట.. భారీగా తగ్గనున్న వీటి ధరలు

by Malleboina Mahesh |   (  Updated:2026-02-01 08:16:14  IST  )

ఈ రోజు భారత పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ సామాన్య ప్రజలకు మిశ్రమ ఫలితాలను అందించింది.

2026 బడ్జెట్‌లో సామాన్యులకు ఊరట.. భారీగా తగ్గనున్న వీటి ధరలు
X

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు భారత పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ సామాన్య ప్రజలకు మిశ్రమ ఫలితాలను అందించింది. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఎలక్ట్రానిక్స్, వైద్య రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. మొబైల్ ఫోన్లు, టాబ్లెట్ల తయారీలో వాడే విడిభాగాలపై దిగుమతి సుంకాలను తగ్గించింది. దీంతో స్మార్ట్‌ఫోన్ల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. అలాగే అత్యంత కీలకమైన నిర్ణయంగా.. క్యాన్సర్ చికిత్సలో వాడే 17 రకాల ప్రాణరక్షక మందులపై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల క్యాన్సర్ రోగులకు వైద్య ఖర్చులు భారీగా తగ్గనున్నాయి.

మరోవైపు, పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల (EV) బ్యాటరీల తయారీలో ఉపయోగించే లిథియం వంటి ఖనిజాలపై పన్నులు తగ్గించారు. దీంతో ఈవీ కార్లు, స్కూటర్ల ధరలు తగ్గనున్నాయి. అలాగే సోలార్ ప్యానెల్స్, వెండి, తోలు వస్తువులు, విదేశీ టూర్ ప్యాకేజీలు చవకగా మారనున్నాయి. అయితే, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే విలాసవంతమైన గడియారాలు, మద్యం, కొన్ని రకాల టెలికాం పరికరాలు, ప్లాస్టిక్ ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి.

Read More..

Budget 2026-2027: వివిధ రంగాలకు నిధులు - కేటాయింపులు

Next Story