- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Budget 2026-2027: వివిధ రంగాలకు నిధులు - కేటాయింపులు
2026- 2027 ఆర్థిక సంవత్సరానికి లోక్‌సభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: 2026- 2027 ఆర్థిక సంవత్సరానికి లోక్‌సభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. బడ్జెట్‌లో రవాణా రంగానికి అత్యధికంగా రూ. 5,98,520 కోట్లు కేటాయించగా, గ్రామీణాభివృద్ధికి రూ. 2,73,108 కోట్లు, రక్షణ రంగానికి రూ. 5,04,585 కోట్లు కేటాయించారు. హోం వ్యవహారాలకు రూ. 2,55,734 కోట్లు, వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలకు రూ. 1,62,671 కోట్లు వెచ్చించనున్నారు. అలాగే విద్య శాఖకు రూ. 1,39,309 కోట్లు, సామాజిక సంక్షేమానికి రూ. 1,09,025 కోట్లు, ఆరోగ్య రంగానికి రూ. 1,04,599 కోట్లు కేటాయించారు.
పట్టణాభివృద్ధికి రూ. 85,522 కోట్లు, ఐటీ మరియు టెలికాం రంగానికి రూ. 74,560 కోట్లు, వాణిజ్య మరియు పరిశ్రమల శాఖకు రూ. 70,206 కోట్లు కేటాయింపులు చేశారు. అలాగే శాస్త్రీయ విభాగాలకు రూ. 55,756 కోట్లు, పన్నుల పరిపాలనకు రూ. 45,500 కోట్లు, విదేశాంగ వ్యవహారాలకు రూ. 22,119 కోట్లు, ఆర్థిక శాఖకు రూ. 20,649 కోట్లు కేటాయించారు. ఉత్తర తూర్పు రాష్ట్రాల అభివృద్ధికి రూ. 6,812 కోట్లు ప్రత్యేకంగా కేటాయించినట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు.
Read More..






