Budget2026: చిన్న ట్యాక్స్ పేయర్లకు శుభవార్త.. పన్ను చెల్లింపులో విప్లవాత్మక మార్పులపై ఆర్థిక మంత్రి కీలక ప్రకటన

by Malleboina Mahesh |   (  Updated:2026-02-01 07:52:11  IST  )

చిన్న ట్యాక్స్ పేయర్లకు కేంద్ర బడ్జెట్ 2026లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త తెలిపారు. పన్ను చెల్లింపు ప్రక్రియ లో విప్లవాత్మక మార్పులు చేస్తూ.. కీలక సంస్కరణలు ప్రకటించారు.

Budget2026: చిన్న ట్యాక్స్ పేయర్లకు శుభవార్త.. పన్ను చెల్లింపులో విప్లవాత్మక మార్పులపై ఆర్థిక మంత్రి కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: చిన్న ట్యాక్స్ పేయర్లకు కేంద్ర బడ్జెట్ 2026లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త తెలిపారు. పన్ను చెల్లింపు ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు చేస్తూ.. కీలక సంస్కరణలు ప్రకటించారు. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న చిన్న పన్ను చెల్లింపుదారులు ఇకపై 'లోయర్- నిల్ టాక్స్ డిడక్షన్' (Lower or Nil TDS) సర్టిఫికెట్ కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఇప్పటివరకు అసెసింగ్ ఆఫీసర్‌కు దరఖాస్తు చేసుకుని, వారి అనుమతి కోసం వేచి చూడాల్సి వచ్చేది. కానీ, ఇకపై 'రూల్ బేస్డ్ ఆటోమేటెడ్ ప్రాసెస్' ద్వారా అర్హులైన వారికి ఎటువంటి మానవ ప్రమేయం లేకుండానే సాఫ్ట్‌వేర్ ద్వారా నేరుగా ఈ సర్టిఫికేట్లు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మరోవైపు, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కూడా మంత్రి పెద్ద ఊరటనిచ్చారు. వివిధ కంపెనీల్లో షేర్లు కలిగి ఉన్న వారు టీడీఎస్ (TDS) మినహాయింపు కోసం ప్రతి కంపెనీకి విడివిడిగా ఫారమ్ 15G లేదా 15Hలను పంపే శ్రమ ఇకపై ఉండదు. ఇన్వెస్టర్లు తమ డిపాజిటరీ (CDSL లేదా NSDL) వద్ద ఒక్కసారి ఈ ఫారమ్‌లను సమర్పించవచ్చు. ఆ డిపాజిటరీలే నేరుగా సంబంధిత కంపెనీలన్నింటికీ ఆ సమాచారాన్ని డిజిటల్ పద్ధతిలో చేరవేస్తాయి. ఈ డిజిటల్ సంస్కరణల వల్ల పన్ను చెల్లింపుదారులకు సమయం ఆదా అవ్వడమే కాకుండా, పన్ను వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Read More..

ట్యాక్స్ పేయర్లకు ఊరట.. ఐటీ రిటర్నుల సవరణ గడువు మార్చి వరకు పెంపు!

Next Story