- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Budget 2026: ఆ రికార్డును బ్రేక్ చేయలేకపోయిన నిర్మలమ్మ.. 80 నిమిషాల పాటు సాగిన ప్రసంగం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో 2026-2027 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. తన ప్రసంగంలో ఆర్థిక మంత్రి పలు రంగాలకు శుభవార్త వినిపించారు.

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో 2026-2027 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. తన ప్రసంగంలో ఆర్థిక మంత్రి పలు రంగాలకు శుభవార్త వినిపించారు. వైద్య, పర్యాటక, విద్య, ఆర్థికరంగాల అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. దేశంలో పేదరికం తగ్గుతోందని చెప్పారు. అయితే మొత్తం 80నిమిషాల పాటు నిర్మలా సీతారామన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
నిర్మలా సీతారామన్ మొత్తం 9సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగా 2020 ఫిబ్రవరి 1న 2 గంటల 40 నిమిషాల పాటు ప్రసంగించి అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన కేంద్ర ఆర్థికమంత్రిగా రికార్డు క్రియేట్ చేశారు. సమయాభావం వల్ల మరో 2 పేజీలను పూర్తి చేయకుండానే వదిలేశారు. అయితే ఈ సారి బడ్జెట్ లో మరింత ఎక్కువ సమయం ప్రసంగించి తన రికార్డును తానే తిరిగిరాస్తారని అనుకుంటే 80నిమిషాలకే పరిమితం చేశారు. ఇక పార్లమెంట్ లో అత్యధిక సమయం ప్రసంగించి నిర్మలా సీతారామన్ రికార్డు క్రియేట్ చేస్తే.. 1977లో కేంద్ర ఆర్థికమంత్రి హిరుబాయ్ ముల్జిబాయ్ కేవలం 800 పదాలు అతి తక్కువ సమయం మాట్లాడి బడ్జెట్ ప్రసంగాన్ని ముగించేశారు.
Read More..






