- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమస్యలు చక్కదిద్దే ప్రయత్నం ఒక్కటి కూడా లేదు: ఖర్గే విమర్శలు
కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ దారి తప్పిందని విమర్శించారు. యూపీఏ హయాంలో 7.5%గా ఉన్నఉత్పాదకత వృద్ధి ఇప్పుడు 3.5%కి పతనమైందని మండిపడ్డారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 92కి దిగజారిందని గుర్తుచేశారు. పెరుగుతున్న ఆర్థిక గందరగోళంపై కేంద్రానికి పట్టింపు లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సమస్యలు చక్కదిద్దే దిశగా ఒక్క గట్టి ప్రయత్నం కూడా లేదని మల్లికార్జున ఖర్గే సీరియస్ అయ్యారు. కేంద్ర బడ్జెట్ ఫ్రీ ఫాల్‌లో ఉన్న ఆర్థిక సూచికలకు నిజమైన పరిష్కారాలు అందిస్తుందా అని ఆయన ప్రశ్నించారు. గడిచిన 12 ఏళ్లుగా బీజేపీనే అధికారంలో ఉందని, ఇకపై లెగసీ సాకుతో తప్పించుకోలేదని ఖర్గే అన్నారు. ఎన్డీయే సర్కారే ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిందని, యూపీఏ పాలనలో తయారీ రంగం వృద్ధి 7.4% ఉండగా, ఎన్‌డీఏ పాలనలో 3.54%కి పడిపోయిందని ఆయన పేర్కొన్నారు.
Read More..






