- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Budget2026: ఎగుమతులకు పన్ను ఊతం.. సముద్ర ఉత్పత్తులు, పాదరక్షల రంగాలకు బడ్జెట్ ప్రోత్సాహకాలు
2026 బడ్జెట్‌లో ఎగుమతులకు పన్ను ఊతం కల్పించింది. భారతీయ ఎగుమతులను అంతర్జాతీయ మార్కెట్‌లో మరింత పోటీతత్వంతో నిలబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: 2026 బడ్జెట్‌లో ఎగుమతులకు పన్ను ఊతం కల్పించింది. భారతీయ ఎగుమతులను అంతర్జాతీయ మార్కెట్‌లో మరింత పోటీతత్వంతో నిలబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా సముద్ర ఉత్పత్తుల ప్రాసెసింగ్‌లో ఉపయోగించే నిర్దిష్ట ముడి పదార్థాల డ్యూటీ-ఫ్రీ (సుంకం లేని) దిగుమతి పరిమితిని ప్రభుత్వం భారీగా పెంచింది. ఇప్పటివరకు గత ఏడాది ఎగుమతి టర్నోవర్‌లో (FOB విలువ) కేవలం 1 శాతంగా ఉన్న ఈ పరిమితిని, ఇకపై 3 శాతానికి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనివల్ల రొయ్యల మేత (Shrimp feed) వంటి ముడి సరుకుల దిగుమతి ఖర్చు తగ్గి, ఎగుమతిదారులకు భారీ లబ్ధి చేకూరుతుంది.
అదేవిధంగా, పాదరక్షల రంగానికి కూడా మంత్రి తీపి కబురు అందించారు. ప్రస్తుతం లెదర్, సింథటిక్ షూల ఎగుమతిదారులకు అందుబాటులో ఉన్న డ్యూటీ-ఫ్రీ దిగుమతి సదుపాయాన్ని, ఇకపై షూ అప్పర్స్ (Shoe Uppers) ఎగుమతి చేసే వారికి కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు, లెదర్, టెక్స్‌టైల్ దుస్తులు, పాదరక్షల ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను విదేశాలకు పంపే గడువును ప్రస్తుతమున్న 6 నెలల నుండి ఒక ఏడాదికి పొడిగించారు. ఈ నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి తీరప్రాంత, పారిశ్రామిక రాష్ట్రాల్లోని ఎగుమతి యూనిట్లకు కొత్త ఉత్తేజం లభించనుంది.
Read More..






