- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్రం సంచలన నిర్ణయం.. ఆర్థిక నేరాలకు విధించే జరిమానా, శిక్షలు తగ్గింపు
ఆర్థిక నేరాలకు విధించే జరిమానా, శిక్షల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుం

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్థిక నేరాలకు విధించే జరిమానా, శిక్షల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక నేరాల్లో విధించే శిక్షలు తగ్గిస్తున్నట్లు ఇవాళ లోక్ సభలో బడ్జెట్ స్పీచ్‍లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పన్ను వివాదాల్లో క్రిమినల్ చర్యల తీవ్రత తగ్గిస్తామని తెలిపారు. పన్ను వివాదాల్లో జైలుశిక్ష రెండేళ్లకు తగ్గిస్తున్నామని, ఒక వేళ జరిమానా చెల్లిస్తే రెండేళ్ల జైలుశిక్ష కూడా మినహాయింపు ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. అలాగే ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్ కమ్ ట్యాక్స్ చట్టం అమల్లోకి రాబోతోందని వెల్లడించారు. సామాన్యులు సైతం ఫైల్ చేసేలా మార్పులు చేశామని, సరళతరం చేసిన ఫారాలు త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే సవరించిన పన్ను రిటర్నుల దాఖలు గడువు పెంచుతున్నామని డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు.






