Budget2026: రవాణా రంగంలో విప్లవం.. కొత్త ఫ్రైట్ కారిడార్లు, 20 జలమార్గాలు

by Malleboina Mahesh |   (  Updated:2026-02-01 06:14:37  IST  )

ఈ రోజు ఉదయం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026లో రవాణా రంగంలో విప్లవం దిశగా నిర్ణయం తీసుకున్నారు.

Budget2026: రవాణా రంగంలో విప్లవం.. కొత్త ఫ్రైట్ కారిడార్లు, 20 జలమార్గాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు ఉదయం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026లో రవాణా రంగంలో విప్లవం దిశగా నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణహితమైన, తక్కువ ఖర్చుతో కూడిన సరుకు రవాణాను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2026లో ప్రతిష్టాత్మక ప్రణాళికలను ప్రకటించింది. తూర్పు భారతదేశంలోని దన్కుణి (పశ్చిమ బెంగాల్) నుండి పశ్చిమ తీరంలోని సూరత్ (గుజరాత్) వరకు కొత్తగా 'డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్' (Dedicated Freight Corridor) ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ కారిడార్ ద్వారా పారిశ్రామిక కేంద్రాల మధ్య సరుకు రవాణా వేగవంతం కావడమే కాకుండా, లాజిస్టిక్స్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని ఆమె పేర్కొన్నారు.

అంతేకాకుండా, రాబోయే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 20 కొత్త జలమార్గాలను (National Waterways) అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా మొదటగా ఒడిశాలోని నేషనల్ వాటర్‌వే-5ను అభివృద్ధి చేయనున్నారు. ఇది ఖనిజ సంపద అధికంగా ఉండే తాల్చేర్, అంగుల్ ప్రాంతాలను కళింగనగర్ వంటి పారిశ్రామిక కేంద్రాలతో.. పారాదీప్, ధమ్రా ఓడరేవులతో అనుసంధానిస్తుంది. వీటితో పాటు, అంతర్గత జలమార్గాల్లో తిరిగే నౌకల కోసం వారణాసి, పాట్నాల్లో అత్యాధునిక 'షిప్ రిపేర్ ఎకోసిస్టమ్' (నౌకల మరమ్మతు కేంద్రాలు) ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ చర్యల ద్వారా అటు పర్యావరణ పరిరక్షణతో పాటు ఇటు ఆర్థిక వృద్ధికి పెద్దపీట వేయనుంది.

Read More..

హైదరాబాద్‌కు కేంద్రం గుడ్‌న్యూస్.. బడ్జెట్‌లో కీలక ప్రకటన

Next Story