Union Budget 2026: ఏపీకి బడ్జెట్ వరం.. 'రేర్ ఎర్త్ కారిడార్' ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

by Malleboina Mahesh |   (  Updated:2026-02-01 06:05:36  IST  )

కేంద్ర బడ్జెట్ 2026-27లో నిర్మాల సీతారామన్ కీలక ప్రకటన చేశారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా భాగంగా ఆంధ్రప్రదేశ్ సహా ఖనిజ సంపద కలిగిన రాష్ట్రాలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక తీపి కబురు అందించారు.

Union Budget 2026: ఏపీకి బడ్జెట్ వరం.. రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర బడ్జెట్ 2026-27లో నిర్మాల సీతారామన్ కీలక ప్రకటన చేశారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా భాగంగా ఆంధ్రప్రదేశ్ సహా ఖనిజ సంపద కలిగిన రాష్ట్రాలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక తీపి కబురు అందించారు. దేశంలో అరుదైన ఖనిజాల (Rare Earth Minerals) వెలికితీత, వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రత్యేక 'రేర్ ఎర్త్ కారిడార్లను' (Dedicated Rare-earth Corridors) ఏర్పాటు చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. 2025లో ప్రారంభించిన అరుదైన ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ పథకానికి కొనసాగింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు.

ఈ కారిడార్ల ఏర్పాటు ద్వారా ఎలక్ట్రానిక్స్, రక్షణ, క్లీన్ ఎనర్జీ రంగాల్లో భారతదేశం స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా, విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి తీరప్రాంత రాష్ట్రాల్లో అపారంగా ఉన్న ఖనిజ సంపదను పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడానికి ఈ కారిడార్లు దోహదపడతాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా ఆయా రాష్ట్రాల్లో కొత్త పరిశ్రమల స్థాపనతో పాటు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

Read More..

Union Budget 2026 : సెమి కండక్టర్ మిషన్ 2.0కు శ్రీకారం.. కీలక ప్రకటన చేసిన నిర్మలా సీతారామన్

Next Story