- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్యాక్స్ పేయర్లకు ఊరట.. ఐటీ రిటర్నుల సవరణ గడువు మార్చి వరకు పెంపు!
బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్యాక్స్ పేయర్లకు ఊరట కలిగించే వార్తను ఆందించింది.

దిశ, వెబ్ డెస్క్: బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్యాక్స్ పేయర్లకు (Taxpayers) ఊరట కలిగించే వార్తను ఆందించింది. ఐటీ రిటర్నులలో దొర్లిన పొరపాట్లను సరిదిద్దుకోవడానికి (Revised Returns) ఇచ్చే గడువును ప్రస్తుతం ఉన్న డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనివల్ల పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులలోని లోపాలను సరి చేసుకోవడానికి అదనంగా మూడు నెలల సమయం లభించినట్లయింది. తక్కువ మొత్తంలో నామినల్ ఫీజు (Nominal Fee) చెల్లించి ఈ సవరణలు చేసుకోవచ్చని మంత్రి వెల్లడించారు.
ఐటీ రిటర్నుల దాఖలు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం సరికొత్త 'స్టాగర్డ్ టైమ్‌లైన్' (Staggered Timeline) విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఐటీఆర్-1, ఐటీఆర్-2 దాఖలు చేసే వ్యక్తులకు జూలై 31 వరకు గడువు ఉండగా, ఆడిటింగ్ అవసరం లేని చిన్న వ్యాపారులు, ట్రస్ట్‌లకు గడువును ఆగస్టు 31 వరకు పొడిగించారు. పన్ను రిటర్నుల దాఖలు సమయంలో సర్వర్లపై పడే ఒత్తిడిని తగ్గించి, పన్ను చెల్లింపుదారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ వివరాలను నమోదు చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వివరించింది.
Read More..






