Budget2026: క్రీడల్లో భారత్ విశ్వరూపం.. పదేళ్ల లక్ష్యంతో 'ఖేలో ఇండియా మిషన్' ప్రారంభం!

by Malleboina Mahesh |   (  Updated:2026-02-01 06:49:16  IST  )

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2026 లో భారతదేశాన్ని క్రీడల రంగంలో ప్రపంచ అగ్రగామిగా నిలబెట్టేందుకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రకటన చేసింది.

Budget2026: క్రీడల్లో భారత్ విశ్వరూపం.. పదేళ్ల లక్ష్యంతో ఖేలో ఇండియా మిషన్ ప్రారంభం!
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2026 లో భారతదేశాన్ని క్రీడల రంగంలో ప్రపంచ అగ్రగామిగా నిలబెట్టేందుకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రకటన చేసింది. గతంలో విజయవంతమైన 'ఖేలో ఇండియా' కార్యక్రమాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తూ, రాబోయే దశాబ్ద కాలంలో క్రీడా రంగాన్ని సమూలంగా మార్చే లక్ష్యంతో 'ఖేలో ఇండియా మిషన్' (Khelo India Mission) ను ప్రారంభిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. క్రీడా రంగం కేవలం వినోదానికే పరిమితం కాకుండా, ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలకు బలమైన వేదికగా నిలుస్తుందని ఆమె ఈ సందర్భంగా సభలో ప్రకటించారు.

ఈ ఖేలో ఇండియా మిషన్ ద్వారా అట్టడుగు స్థాయి నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారికి ప్రపంచ స్థాయి శిక్షణ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. కోచ్‌లకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్ పరిశోధనలు, అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పన, నిరంతర క్రీడా పోటీల నిర్వహణపై ఈ మిషన్ ప్రధానంగా దృష్టి సారిస్తోంది. 2030 కామన్వెల్త్ గేమ్స్, 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం భారత్ సిద్ధమవుతున్న తరుణంలో, ఈ 'ఖేలో ఇండియా మిషన్' క్రీడాకారుల తయారీలో కీలక పాత్ర పోషించనుంది.

Read More..

విదేశీ పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్ పరిమితి 10 శాతానికి పెంపు

Next Story