అవును.. కాషాయ రంగు..! మోడీ, నెతన్యాహు మధ్య ఆసక్తికర సంభాషణ

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-25 15:43:42  IST  )

ఇజ్రాయెల్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ, బెంజమిన్ నెతన్యాహు మధ్య జరిగిన సరదా సంభాషణ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

అవును.. కాషాయ రంగు..! మోడీ, నెతన్యాహు మధ్య ఆసక్తికర సంభాషణ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఇజ్రాయెల్ పర్యటనలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇవాళ మోదీ విమానం దిగగానే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే, ప్రధాని మోదీ తెలుపు రంగు కుర్తా పైజామా, స్లీవ్‌లెస్ జాకెట్ ధరించారు. ఆయన జాకెట్ జేబులో కాషాయ రంగు (Saffron) పాకెట్ స్క్వేర్ పెట్టుకున్నారు. ఆశ్చర్యకరంగా నెతన్యాహు భార్య, ఇజ్రాయెల్ ప్రథమ మహిళ సారా నెతన్యాహు కూడా సరిగ్గా అదే రంగు డ్రెస్‌ను ధరించారు. విమానాశ్రయంలో మోదీని హత్తుకుని స్వాగతించిన నెతన్యాహు.. మోదీ పాకెట్ స్క్వేర్‌ను, తన భార్య డ్రెస్ కలర్‌ను గమనించారు. వెంటనే ఆయన మోదీకి చూపిస్తూ.. ‘ఆమె ఏం ధరించిందో చూశారా?’ అంటూ సరదాగా అడిగారు. అందుకు మోదీ నవ్వుతూ, ‘అవును.. కాషాయ రంగు’ అని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం అందకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇజ్రాయెల్ పర్యటనలో ప్రధాని మోడీ.. ఆ కూటమికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

Next Story