ఇంట్లోనే వినాయకుడిని తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-25 15:27:20  IST  )

విఘ్ఙాలను తొలగించేవాడు వినాయకుడు. అందుకే హిందువులు ఏదైనా శుభకార్యం చేసే ముందుకు వినాయకుడి పూజనే ముందుగా చేస్తుంటారు.

ఇంట్లోనే వినాయకుడిని తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే!
X

దిశ, వెబ్ డెస్క్: విఘ్ఙాలను తొలగించేవాడు వినాయకుడు. అందుకే హిందువులు ఏదైనా శుభకార్యం చేసే ముందుకు వినాయకుడి పూజనే ముందుగా చేస్తుంటారు. ఇక మరో రెండు రోజుల్లో వినాయక చవితి (Ganesha Chavithi) వేడుకలు జరుపుకోనున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా గల్లీ గల్లీనా గణపతి నవరాత్రి ఉత్సవాల సందడి మొదలైంది. వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చేందుకు గణనాథుడి ప్రతిమలు, అందంగా అలంకరించిన మండపాల్లో కొలువుదీరెందుకు రెడీగా ఉన్నాయి. ఇక చాలా మంది తమ ఇళ్లలో కూడా వినాయకుడిని ఏర్పాటు చేసుకుని ఐదు, ఏడు, తొమ్మిది రోజులు పూజలు నిర్వహిస్తుంటారు. అయితే, మార్కెట్‌లో దొరికే ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌(POP)తో చేసిన ప్రతిమలు కొనుగోలు చేయకుండా ఇంట్లోనే మట్టితో స్వయంగా వినాయకుడిని చేసుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేసినట్లు అవుతుంది. కానీ, మనలో చాలా మందికి వినాకుడిని తయారు చేసుకోవటం సరిగా రాదు. ఇలాంటి వారికోసమే బిస్వనాథ్ పాల్ అనే కళాకారుడు మట్టితో వినాయకుడి ప్రతిమ ఎలా తయారుచేసుకోవాలో తెలియజేస్తూ ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో చూస్తే సింపుల్‌గా అందంగా వినాయకుడి ప్రతిమను ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ప్రతస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా కూడా మారింది. మరీ మీరు కూడా ఈ వీడియో చూసి ఇంట్లోనే విగ్రహాన్ని తయారుచేసుకోండి.

వినాయక చవితి రోజున పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి

Read More..

లాల్‌బాగ్‌ గణపతి ఫస్ట్ లుక్ రివీల్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్

Next Story