- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లాల్‌బాగ్ గణపతి ఫస్ట్ లుక్ రివీల్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్
ముంబై నగరంలోని ప్రముఖ గణేశుడిగా పేరుగాంచిన లాల్‌బాగ్‌చా రాజా 2025 గణపతి బొమ్మకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఆదివారం విడుదలయ్యింది.

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. ఈనెల 27న గణపతి బప్పా మండపంలో కొలువుదీరి.. తొమ్మిది రాత్రులు భక్తులతో ప్రత్యేక పూజలను అందుకోనున్నాడు. అందుకే ఢిల్లీ నుంచి గల్లీ వరకు గణపయ్యలను కొలువుదీర్చేందుకు మండపాలు సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. ఇక మహారాష్ట్రలో ప్రతి ఏటా గణపతి నవరాత్రి ఉత్సవాలు భారీ స్థాయిలో నిర్వహిస్తుంటారు. అందులోనూ సెంట్రల్ ముంబైలోని (Mumbai) లాల్‌బాగ్ మార్కెట్‌లో కొలువుదీరే గణనాథులలో లాల్‌బాగ్చా రాజా (LalbaugchaRaja) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు. లాల్‌బాగ్ వినాయకుడిని చూసేందుకు మనదేశం నుంచే గాక ప్రపంచంలోని చాలా ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. 10 రోజుల పాటు సాగే ఈ గణేశ ఉత్సవంలో ప్రతిరోజూ లక్షల మంది భక్తులు స్వామివారిని చూసేందుకు తరలివస్తుంటారు. ఇక ఈ ఏడాది కూడా లాల్‌బాగ్‌చా భక్తులను దర్శనమిచ్చేందుకు సిద్ధమయ్యాడు.
ఈ సందర్భంగా లాల్‌బాగ్‌చా రాజా 2025 గణపతి బొమ్మకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఆదివారం విడుదలయ్యింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ దివ్య రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గణపతి బప్పా మనోహరమైన రూపాన్ని చూసిన తరువాత, లాల్‌బాగ్చా మండపం గణపతి బప్పా మోరియా నినాదాలతో మార్మోగిపోయింది. ఒక చేతిలో చక్రం, మరో చేతిలో శంఖం పట్టుకుని, తలపై కిరీటం పెట్టుకుని పట్టు వస్త్రాలు ధరించి సింహాసనంపై ఆసీన్నుడై బప్పా ఎంతో శోభాయమానంగా భక్తులకు మొదటి దర్శనమిచ్చారు. ఇక ఫస్ట్ లుక్ విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో #LalbaugchaRaja2025 హ్యాష్‌టాగ్‌తో అభిమానులు ఫోటోలు, వీడియోలు పంచుకుంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు.
కాగా, 1934లో లాల్‌బాగ్‌చా రాజా సర్వజనిక గణేశోత్సవ మండల్ స్థాపించబడింది. నాటి నుంచి విగ్రహా తయారీ బాధ్యత కాంబ్లీ కుటుంబామే చూసుకుంటుంది. ఈ గణపతి విగ్రహం డిజైన్ పేటెంట్‌ను కూడా వారు పొంది ఉన్నారు. ఇక ఈసారి అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే.. మొదటిసారిగా లాల్‌బాగ్‌చా రాజా ఆస్థానం ఎత్తును 50 అడుగులు పెంచారు. సాధారంగా 20 అడుగులు ఉండేది. లాల్‌బాగ్ గణపతిని కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాలవారు దర్శించుకుని, ఆశీస్సులు పొందుతారు. బాలీవుడ్ ప్రముఖులు, పెద్దపెద్ద రాజకీయ నాయకులు, ముకేశ్ అంబానీ కుటుంబ సభ్యులు, పలువురు బడా వ్యాపారవేత్తలు లాల్‌బాగ్చా రాజా ఆశీర్వాదం కోసం వస్తారు.
Read More..
ఇంట్లోనే వినాయకుడిని తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే!






