VIRAL: రన్నింగ్‌లో ఊడిన స్కూల్ బస్సు టైర్లు.. విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం (వీడియో)

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-06 06:17:18  IST  )

రన్నింగ్‌లోనే స్కూల్ బస్సు టైర్లు ఊడిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.

VIRAL: రన్నింగ్‌లో ఊడిన స్కూల్ బస్సు టైర్లు.. విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు హెచ్చరించినా.. స్కూల్ బస్సుల నిర్వహణలో ప్రైవేటు పాఠశాలల తీరు మాత్రం మారండం లేదు. విద్యార్థుల ప్రాణాలను గాలికొదిలి కొన్ని విద్యా సంస్థలు ఫిట్‌నెస్ లేని బస్సులను యథేచ్ఛగా నడుపుతున్నాయి. తాజాగా కడప జిల్లాలో విద్యార్థులను పెను ప్రమాదమే తప్పింది. వివరాల్లోకి వెళితే.. పులివెందుల మార్కెట్ యార్డు వద్ద రన్నింగ్‌లో ఉన్న ‘వికాస్ హైస్కూల్’ బస్సు వెనుక టైర్లు అకస్మాత్తుగా ఒక్కసారిగా ఊడి నడిరోడ్డుపై పడ్డాయి. దీంతో బస్సు మొత్తం ఓ వైపునకు ఒరిగింది.

ఈ క్రమంలోనే వెనుక నుంచి వెళ్తున్న ద్విచక్ర వాహనదారులను బస్సు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో అందులో ఉన్న విద్యార్థులకు పెను ప్రమాదమే తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మందికి పైగా విద్యార్థులు ఉన్నప్పటికీ, ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రైవేటు వ్యక్తులకు బస్సుల ఫిట్‌నెస్ టెస్ట్ బాధ్యతలు అప్పగించడం వల్లే ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

నేలమట్టమైన శతాబ్ది కాలం నాటి ఆలయం..

Next Story