నేలమట్టమైన శతాబ్ది కాలం నాటి ఆలయం..

by Kodari Anjali |

శతాబ్ది కాలంనాటి చరిత్ర నేలమట్టం అయ్యింది.

నేలమట్టమైన శతాబ్ది కాలం నాటి ఆలయం..
X

దిశ, భద్రాచలం: శతాబ్ది కాలంనాటి చరిత్ర నేలమట్టం అయ్యింది. రామాలయం అభివృద్ధిలో భాగంగా, అనుబంధ ఆలయం అయిన శ్రీ కుసుమ హరనాధ్ బాబా ఆలయాన్ని కూల్చివేశారు. 19 వ శతాబ్దం చివరలో ఈ ఆలయాన్ని అత్యంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో నిర్మించారు. ఈ ఆలయ ప్రాంగణం, మండపాలను రామాలయ మాడవీధుల విస్తరణ అవసరాలకోసం కూల్చివేసి, శివాలయం కు వెళ్లే దారిలో బాలాలయం నిర్మించి కుసుమ, హరల విగ్రహాలను బాలాలయంకు తరలించారు. అయితే రాతి కట్టడంతో, ఎత్తయిన ప్రదేశంలో ఎంతో సుందరంగా కనిపించే ఈ ఆలయం అభివృద్ధి మాటున నేలకొరగటం భక్తులను కలచివేసింది.

Next Story