- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభ్యర్థులకు అఖిలేష్ యాదవ్ ఫిట్‌నెస్ టెస్ట్ పెట్టారా? వైరల్ వీడియో వెనుక అసలు కథ ఇదే

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియా యుగంలో రాజకీయంలో ఏది చేసినా వైరల్ అవుతోంది. నేతల కదలికలపై ప్రత్యర్థులు అనుక్షణం నిఘా ఉంచుతున్నారు. ఏ మాత్రం అవకాశం దొరికినా వైరల్ చేస్తున్నారు. తాజాగా యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ముందు ఆ పార్టీ నేత నమస్కారం చేస్తూ పుష్-అప్స్ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. ప్రస్తుతం యూపీలో ఎన్నికల వాతావరణం నెలకొన్న తురణంలో ఈ వీడియోను వైరల్ చేస్తూ ఎస్పీ పార్టీపై ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ విడియో విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఒకటైతే అసలు వాస్తవం మాత్రం మరొకటి ఉందని తెలుస్తోంది.
‘కుక్కలు కూడా ఇలా చేయవు’:
వైరల్ అవుతున్న వీడియోలో ఎస్‍పీ పార్టీకి చెందిన ఓ నేత అఖిలేశ్ యాదవ్ ముందు పుష్-అప్ చేస్తూ దండం పెడుతూ కనిపిస్తున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలలో నేతల పరిస్థితి ఇలాగే ఉంటుందని కొందరు విమర్శిస్తుంటే, ప్రతి సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తకు ఆత్మగౌరవం ఉండదని, ప్రతి పుష్-అప్ తర్వాత అఖిలేష్ యాదవ్‌కు చేతులు జోడించడంలో అర్థం ఏమిటి?? కనీసం కుక్కలు కూడా తమ యజమాని ముందు ఇలా ప్రవర్తించవు అంటూ మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇంకొందరు రాబోయే 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అభ్యర్థుల ఇంటర్వ్యూల సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఒక వినూత్నంగా ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నారని అందులో భాగంగా టికెట్ ఆశించే ఒక అభ్యర్థిని పుష్-అప్స్ తీయాలని కోరారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ వీడియో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో తెగ చక్కర్లు కొడుతోంది.
అసలు కథ ఇదే:
సోషల్ మీడియాలో లక్షలాది మంది వీక్షించిన ఈ వీడియో వెనుక అసలు వాస్తవం వేరే ఉందని తెలుస్తోంది. ఈ వీడియోలో కనిపిస్తున్న కార్యకర్త పేరు సీతారాం యాదవ్ అలియాస్ కన్హయ్య అని అతడు ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన వ్యక్తి అని ఓ జాతీయ మీడియా పేర్కొంది. మూడేళ్ల క్రితం వరకు సాధారణ వ్యవసాయం చేసుకునే అతడు తన తల్లి ఇచ్చిన ప్రేరణతోనే రాజకీయాల్లోకి వచ్చాడు. సమాజ్‌వాదీ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడైన కన్హయ్య.. ముఖ్యంగా ఎస్పీ పార్టీ వ్యవస్థాపకుడు ‘నేతాజీ’ ములాయం సింగ్ యాదవ్ ఆలోచనలకు పెద్ద అభిమానిగా మారాడు. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరిలో కన్హయ్య తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను అందించడానికి లక్నోలోని అఖిలేష్ యాదవ్ నివాసానికి వెళ్లాడు. ఆ సమయంలో అఖిలేష్‌కు దాదాపు 38 కిలోల బరువున్న ములాయం సింగ్ యాదవ్ ఇత్తడి విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఆ సందర్భంలో కన్హయ్య మాట్లాడుతూ.. "ఈరోజు గనుక నేతాజీ బతికి ఉంటే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసేవాడిని అని భావోద్వేగానికి గురయ్యాడు. దానికి అఖిలేష్ యాదవ్ నవ్వుతూ.. 'మీరు కుస్తీ కూడా పడతారా?" అని అడిగారు. ములాయం సింగ్ కూడా ఒకప్పుడు మల్లయోధుడు కావడంతో కన్హయ్య స్పందిస్తూ.. అవును నేను పహిల్వాన్‌నే అంటూ వెంటనే అక్కడే ములాయం విగ్రహం ముందు పుష్-అప్స్ తీయడం ప్రారంభించాడు. ఆ క్షణంలో రికార్డ్ చేసిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ ట్రెండ్ అవుతోంది.
కన్హాయ్య కూతురి వివాహానికి అఖిలేశ్ హాజరు:
అయితే కన్హాయ్య ఆహ్వనం మేరకు ఫిబ్రవరి 2026లో అఖిలేష్ యాదవ్ స్వయంగా ఝాన్సీకి వెళ్లి కన్హయ్య కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక ఇటీవలే జూలై 1న అఖిలేష్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా కన్హయ్య మరోసారి లక్నోకు వచ్చారు. ఈసారి అఖిలేష్ యాదవ్ సైకిల్ తొక్కుతున్నట్లు ఉన్న 58 కిలోల బరువైన ఇత్తడి విగ్రహాన్ని ఆయనకు కానుకగా ఇచ్చారు. ఈ అపూర్వ కానుకను చూసి అఖిలేష్ ఎంతో సంతోషించారు. ఈ భేటీ తర్వాత కన్హాయ్య పాత పాత పుష్-అప్స్ వీడియో సోషల్ మీడియాలో మళ్లీ వైరల్‌గా మారింది.






